యాంకర్ శ్యామలకు మొదలైన టార్చర్

ఆదివారం అర్థరాత్రి దేశ ఐటీ రాజధాని బెంగళూరు నగరంలో జరిగిన రేవ్ పార్టీ సంచలనంగా మారింది. ఈ రేవ్ పార్టీలో సినీ, రాజకీయ ప్రముఖులు ఉన్నారనే ప్రచారం ప్రచారం జరిగింది. దీంతో ఏపీలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్‌గా మారింది. సినీ ఇండస్ట్రీకి చెందిన హేమ ఈ రేవ్ పార్టీలో ఉన్నట్టు పోలీసులు ధృవికరించారు. జానీ మాస్టర్, హీరో శ్రీకాంత్ పేర్లు కూడా తెరపై వచ్చాయి. కానీ తాము ఆ రేవ్ పార్టీలో లేమని వీరిద్దరు ప్రకటించారు. మరోవైపు వైసీపీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి ఎమ్మెల్యేకు సంబంధించిని స్టికర్ కార్డు కారు రేవ్ పార్టీలో దొరకడంతో ..ఇది పొలిటికల్‌గా పెద్ద ఇష్యూగా మారింది.

దీనిపై రాజకీయంగా విమర్శలు కూడా కొనసాగుతున్నాయి. అయితే ఇదే సమయంలో మంత్రి కారులో తెలుగు ప్రముఖ యాంకర్ కూడా ఉన్నట్టు ప్రచారం జరిగింది. శ్యామల ఇటీవల జరిగిన ఎన్నికల్లో అధికార వైసీపీకి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచార సమయంలో ఆమె టీడీపీ, జనసేన పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు. అయితే ఆమె వైసీపీకి సపోర్టు చేసిన దగ్గర నుంచి కూడా ఓ వర్గం శ్యామలను టార్గెట్ చేసుకుని విమర్శలు చేయడం మొదలుపెట్టారు. టీడీపీ, జనసేనకు సంబంధించిన కొందరు శ్యామల వ్యక్తిగత జీవితంపై కూడా కామెంట్స్ చేశారు.

Anchor Shyamala Strong Counter To fake allegations on rave party

శ్యామల చీకటి భగోతాలు ఎవరికి తెలియవంటూ ఉండవల్లి అనూష, నటుడు పృథ్వీ వంటి వారు ఆమెనుద్దేశించి వ్యాఖ్యలు చేశారు. ఇక ఈ రేవ్ పార్టీలో యాంకర్ శ్యామల ఉన్నట్టు ఆమె వ్యతిరేక మీడియా ప్రచారం చేశారు. తాజాగా దీనిపై ఆమె స్పందించారు. ఓ ప్రముఖ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో ఆమె మాట్లాడుతూ.. ఇంత దిగజారిని రాజకీయాలు చేస్తున్నారు అంటే.. ఒక పార్టీకి నేను సపోర్ట్ చేశాను అని ఇలా నాపై దుష్ప్రచారం చేస్తున్నారు న్యాయమేనా? దయచేసి సోషల్ మీడియాలో వచ్చే వార్తలు నమ్మకండి. అసలు ఆ రేవ్ పార్టీకి నాకు ఎలాంటి సంబంధం లేదు. కొందరు కావాలనే ఇలా చేస్తూ నన్ను బాధపెడుతున్నారు. ఇక నుంచి అయినా ఇలాంటివి చేయడం మానేయండి.

నా మీద బురదజల్లే వాళ్ల మీద న్యాయపరమైన యాక్షన్ తీసుకోవడం జరిగింది. వాళ్ల మీద పరువు నష్టం దావా వేయడం జరిగింది అని యాంకర్ శ్యామల హెచ్చరించింది. జర్నలిస్టులు నిజాన్ని నిర్భయంగా చెప్పగలిగే వాళ్ళు అయి ఉండాలి. అంతేగాని ఇలా అసత్య ప్రచారాలు చేసే వాళ్ళు కాదు. దయచేసి మీ అసత్య ప్రచారాలతో జర్నలిజం విలువలు తగ్గించవద్దు అంటూ చెప్పుకొచ్చింది. యాంకర్ శ్యామలకు వైసీపీ క్యాడర్ అండగా నిలుస్తోంది. ఓ ఆడపిల్లపై ఇలాంటి విష ప్రచారం చేయడాన్ని వారు తప్పుపడుతున్నారు. శ్యామలపై కావాలనే బురద జల్లుతున్నారని వారు అభిప్రాయపడుతున్నారు. ఓ వర్గం శ్యామలపై కావాలనే ఈ విధంగా కుట్ర చేస్తున్నారని అభిమానులు ఫైర్ అవుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+