హాస్పిటల్ బెడ్‌పై యాంకర్ స్రవంతి.. నాలా ఎవరూ ఆ పని చేయవద్దంటూ పోస్ట్
స్రవంతి చొక్కారపు..సినీ అభిమానులకు పెద్దగా పరిచిచం అక్కర్లేని పేరు. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో అమ్మడు పేరు మార్మోగిపోతోంది. అందానికి అందం..టాలెంట్‌కు టాలెంట్ రెండు స్రవంతి సొంతం. ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానెల్‌లో యాంకర్‌గా కెరీర్ మొదలుపెట్టిన స్రవంతి... వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో జరిపిన ఓ ఇంటర్య్వూతో లైఫ్ లైన్లోకి వచ్చింది.ఆ తర్వాత పుష్ప విడుదల సమయంలో చిత్ర యూనిట్‌తో చేసిన ఇంటర్య్వూ స్రవంతి కెరీర్‌ను ఒక్కసారిగా మలుపు తిప్పింది.
హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్‌లను స్రవంతి ఇంటర్య్వూ చేసింది. ఆ సమయంలో ఆమె మాట్లాడిన రాయలసీమ యాసకు వీరిద్దరూ ఫిదా అయ్యారు. రాయలసీమ సినిమాలు తీస్తే కచ్చితంగా స్రవంతి రిఫరెన్స్ తీసుకుంటామని చెప్పడంతో ఓవర్ నైట్ స్టార్‌గా స్రవంతి మారిపోయింది. ఆ తర్వాత పలు షోలకు యాంకరింగ్ చేస్తూ తన పాపులారిటీని మరింత పెంచుకుంది. తనకు వచ్చిన ఈ క్రేజ్‌తో బిగ్‌బాస్‌లో కూడా అడుగుపెట్టింది ఈ హాట్ బ్యూటీ.

ఇక సోషల్ మీడియాలో అమ్మడు చేసే రచ్చ అంతా ఇంతా కాదు. హాట్ హాట్ ఫోజులతో కుర్రకారకు నిద్రలేకుండా చేస్తోంది. పెళ్లైనా ఏమాత్రం తరగని అందంతో కుర్రాళ్ల మతి పోగొడుతుంది.ఎప్పటికప్పుడు గ్లామరస్ ఫొటోలను పోస్ట్ చేస్తూ సందడి చేస్తోంది. పెళ్లైనప్పటికీ గ్లామర్ షోను ఏమాత్రం తగ్గించడం లేదు. డైలీ కొత్త కొత్త ఫొటో షూట్స్ ను పోస్ట్ చేస్తూ కుర్రకారుకు మైకం తెప్పిస్తుంటుంది. రోజు రోజుకు సోషల్ మీడియాలో కూడా విపరీతంగా ఫాలోవర్లను పెంచుకుంటుంది. అలాంటి స్రవంతి తాజాగా హాస్పిటల్ బెడ్ ఉన్న ఫొటోలను షేర్ చేసి షాకిచ్చింది.
'అసలు ఇలాంటి పోస్ట్ పెట్టాలని ఎప్పుడు అనుకోలేదు. ఇప్పుడు పెట్టక తప్పలేదు, కేవలం అవేర్నెస్ కోసం మాత్రమే. స్పెషల్ గా "ఆడవారి కోసం" పెడుతున్నాను. గత 35 - 40 రోజుల నుండి ఆన్ అండ్ ఆఫ్‌గా విపరీతమైన బ్లీడింగ్ అవుతోంది. రకరకాల మెడిసిన్ వాడాను. డాక్టర్‌ను డైరెక్ట్‌గా వెళ్లి చూపించే సమయం లేక స్కానింగ్ చేపించుకోలేదు. ఒక రోజు షూట్ మార్నింగ్ 6:45 నుంచి నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 2:45 వరకు జరిగింది. అప్పుడే నాకు విపరీతమైన కడుపు నొప్పి వచ్చింది. దీంతో వెంటనే డాక్టర్‌ను కంసల్ట్ అయ్యాను.
అప్పుడు తెలిసింది ఇది చిన్న సమస్య కాదు అని, వెంటనే అడ్మిట్ అయ్యి సర్జరీచేయించుకోవాల్సి వచ్చింది. అయితే నేను కంప్లీట్‌గా రికవర్ అవ్వాలి, ముందు లాగ నడవాలి అంటే ఒక 4 నుండి 5 వారాలు పడుతుందని డాక్టర్ చెప్పారు.సో నేను చెప్పాలి అనుకున్నది ఏంటంటే.. అయ్యో ఆల్రెడీ షూట్ కోసం డేట్స్ ఇచ్చేశాను మళ్లీ హెల్త్ బాలేదు అని పర్మిషన్ అడిగితే వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో, ఇబ్బంది పడుతారేమో అని ఫీల్ అవ్వకండి. అది మీరు వర్క్ చేసే ఏ ప్రొఫెషన్ అయినా సరే, హెల్త్ ఈజ్ యువర్ ఫస్ట్ ప్రయారిటీ. వర్క్, షూట్స్,ఈవెంట్స్ అని కుదరక నెగ్లెట్ చేయకండి. ముందు హెల్త్ జాగ్రత్తగా కాపాడుకోండి. ఇవన్నీ ఆటోమేటిక్‌గా సెట్ అవుతాయి'' అంటూ ఓ సుదీర్ఘ పోస్ట్‌ను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
దీనికి తాను హాస్పిటల్ బెడ్‌పై ఉన్న కొన్ని ఫొటోలను సైతం జత చేసింది. ఈ విషయం తెలుసుకున్న ఆమె అభిమానులు ఆందోళన చెందుతూ
స్రవంతి చొక్కారపు త్వరగా కోలుకోవాలని కామెంట్లు పెడుతున్నారు.












Click it and Unblock the Notifications