పిల్లల్ని కనకపోయిన పర్లేదు..మా అమ్మ ఫుల్‌గా ఎంజాయ్ చేయమంది
స్పోర్ట్స్ యాంకర్ వింధ్య క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. స్పోర్ట్స్ ఛానల్స్‌లో తెలుగు ప్రజెంటర్‌గా యాంకర్ వింధ్య విశాఖ అందరికీ పరిచయమే. ముఖ్యంగా ఐపీఎల్ వచ్చిందంటే ఈ పాప సందడి మాములుగా ఉండదు. బుల్లితెరపై యాంకర్ వింధ్య తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇక సెలబ్రిటీ ఇంటర్వ్యూలు, ఆడియో వేడుకలకు హోస్ట్ చేస్తూ తన పాపులారిటీని మరింత పెంచుకుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ భామ పలు ఆసక్తికర అంశాలను అభిమానులతో పంచుకుంది.
తొలుత ఫ్యాషన్ రంగంలోకి కెరీర్ సాగించాలని అడుగుపెట్టానని..అయితే ఊహించని విధంగా స్పోర్ట్స్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చానని యాంకర్ వింధ్య చెప్పుకొచ్చింది. కెరీర్ స్టార్టింగ్‌లో తనకు ఎదురైన కొన్ని ఘటనల గురించి ఈ ఇంటర్య్వూలో వివరించింది. ఓ ఫ్యాషన్ షోకు తాను వెళ్లానని..అక్కడ అమ్మాయిలను ట్రీట్ చేసిన విధానం చూసి షాక్ అయ్యానని తెలిపింది. అక్కడ వాతవరణం చూసి ఈ రంగం సెట్ కాదని అనుకున్నాను. ఆ ఫ్యాషన్‌కు వచ్చిన అమ్మాయిలు బట్టలు మార్చుకోవడానికి సరైన గదులు కూడా లేవు. స్టేజ్ వెనక్కి వెళ్లి అక్కడే అందరి ముందు బట్టలు మార్చుకోవాల్సిన దుస్థితి. ఇది చూసిన నేను షాక్ అయ్యాను.

ఆ వెంటనే డిసైడ్ అయ్యాను.. ఈ రంగం తనకు సెట్ కాదని ఆ క్షణంలోనే నిర్ణయించుకున్నానని వింధ్య తెలిపింది. ఆ ఒక్క ఫ్యాషన్ షోతోనే ఈ రంగానికి గుడ్ బై చెప్పానని యాంకర్ వింధ్య తెలిపింది. ఇక మా ఇంట్లో మొదటి నుంచి కూడా నాకు ఫ్రీడమ్ ఇచ్చారని..ముఖ్యంగా మా అమ్మ నాకు చాలా సపోర్టుగా నిలిచిందని వింధ్య చెప్పుకొచ్చింది. మా అమ్మ నాకు ఎప్పుడూ ఒక మాట చెబుతూ ఉంటుంది. నువ్వు సమాజం గురించి ఆలోచించకు. ఈ వయస్సులోనే పెళ్లి చేసుకోవాలి.. ఆ ఏజ్‌లో పిల్లలను కనాలి. అలాంటి బట్టలే వేసుకోవాలనేది ఫస్ట్ నీ బ్రెయిన్ నుంచి తీసేయమని మా అమ్మ చెప్పిందని వింధ్య తెలిపారు.
మేము జీవితంలో ఎంజాయ్ చేయలేకపోయాము. కాబట్టి నువ్వు బాగా ఎంజాయ్ చేయాలి. నువ్వు పెళ్లి చేసుకుని పిల్లలను కనకపోయినా పర్లేదు. కానీ నీకు నచ్చిన పని చేయి. నచ్చినట్టు ఉండు. అంతేకానీ ఎవరో ఏదో అనుకుంటారని ఆలోచించి నీ ఇష్టాలను వదులుకోకు. నీ క్యారెక్టర్ గురించి ఏమనుకుంటారో అని నిన్ను నువ్వు కోల్పోకు. నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో అది చెయ్. అని చెప్తుంది కానీ అదే చేయి లాంటివి మా అమ్మ ఎప్పుడూ చెప్పలేదని వింధ్య చెప్పుకొచ్చింది. వింధ్య చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.












Click it and Unblock the Notifications