Anchor vishnu priya:పబ్‌లో రచ్చ చేసిన యాంకర్..జబర్దస్త్ నటితో కలిసి తాగుతూ రెచ్చిపోయిన వైనం
టెలివిజన్ షోల ద్వారా పాపులారిటీ సంపాదించిన వారి లిస్ట్ చాలానే ఉంది. అలాంటి వారిలో యాంకర్ విష్ణు ప్రియ కూడా ఒకరు. యాంకర్‌గా అతి తక్కువ కాలంలోనే విష్ణు ప్రియ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా ''పోవే పోరా' షోతో అమ్మడు మంచి క్రేజ్ సంపాదించుకుంది. తరువాత ఈ భామ పలు షోలతో పాటు కొన్ని వెబ్ సిరీస్‌ల్లో నటించి మెప్పించింది. హీరోయిన్స్ మాదిరిగానే బోల్డ్ కామెంట్స్ చేయడంలో అమ్మడు దిట్ట.
ఆ మధ్య సీనియర్ హీరో జేడీ చక్రవర్తిని పిచ్చిగా ప్రేమిస్తున్నానని చెప్పి విష్ణుప్రియ అందరికి షాకిచ్చింది.తన ప్రేమ పెళ్లిగా మారితే బాగుంటుందని నేనైతే ఆయనకు చెప్పానని విష్ణుప్రియ ఇటీవల ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో తెలిపింది.ఆయన నిర్ణయం కోసం వెయిటింగ్ అని వెల్లడించింది. ఒప్పుకుంటే వాళ్ల ఇంటికి కోడలిగా వెళ్లడానికి నేను సిద్ధమేనని ఆమె కామెంట్స్ చేశారు.అయితే విష్ణుప్రియ ప్రపోజల్‌ను జేడీ చక్రవర్తి లైట్ తీసుకోవడంతో.. ఆమెది వన్ సైడ్ లవ్‌గా మారిపోయింది.

తాజాగా విష్ణుప్రియ ఓ పబ్‌లో రచ్చ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జబర్దస్త్ నటి రీతూ చౌదరితో కలిసి విష్ణు ప్రియ పబ్‌లో దర్శనం ఇచ్చింది. వీరిద్దరు ఫుల్ స్వింగ్‌లో కనిపించారు. రీతూ చౌదరి,విష్ణు ప్రియ ఇద్దరూ కూడా చిల్ అవుతూ డ్యాన్స్ వేయడం ఈ వీడియోలో కనిపించింది. ఈ వీడియోలో వీరి టేబుల్‌పై కొన్ని బాటిల్స్ కూడా దర్శనం ఇచ్చాయి. ఈ వీడియోను విష్రుప్రియ తన సోషల్ మీడియా అకౌంట్‌లో షేర్ చేసింది. 'కొన్ని రకాల స్నేహితులను వెతకడానికి వెలకట్టలేము' అంటూ వీడియో క్రింద క్యాప్షన్ పెట్టింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.












Click it and Unblock the Notifications