సిగ్గు లేదా మీకు.. ఇంత కక్కుర్తా.. ఆమెకు బాగా కలిసొచ్చిన నెగిటివ్ పబ్లిసిటీ !!
యాంకర్ విష్ణు ప్రియ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అవసరం లేదు. టెలివిజన్‌లో వరుస షోల ద్వారా ప్రేక్షకులను అలరించిన ఈ అమ్మడు.. ఆ తర్వాత బిగ్ బాస్ షో లోకి కూడా ఎంట్రీ ఇచ్చి మరింత చేరువైంది. ఈ అమ్మడుకి సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫాలోయింగ్ తెచ్చుకుంది. గతంలో అందాలను ఆరబోస్తూ గ్లామర్ ఫోటోషూట్‌లతో నెట్టింట హీట్ పెంచింది. అయితే రీసెంట్ గానే ఇన్‌స్టాగ్రామ్ లో 'సబ్‌స్క్రిప్షన్స్' షురూ చేసింది. అయితే ఈ వ్యవహారంలో విష్ణు ప్రియకి బిగ్ షాక్ తగిలిన విషయం తెలిసిందే.
కాగా విష్ణుప్రియపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఏఐఎస్‌ఎఫ్ నాయకులు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. డబ్బుల కోసం కక్కుర్తి పడి యువతను తప్పుదోవ పట్టించేలా అర్ధనగ్న వీడియోలు పోస్ట్ చేస్తున్నారని, ఆమె ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను వెంటనే బ్లాక్ చేయాలని వారు డిమాండ్ చేశారు. సెలబ్రిటీలుగా సమాజానికి ఆదర్శంగా ఉండాల్సింది పోయి, ఇలాంటి అశ్లీల ప్రచారాలు చేయడం సరికాదని వారు విమర్శించారు.

అయితే నేటి కాలంలో నెగటివ్ పబ్లిసిటీ కూడా కాసుల వర్షం కురిపిస్తుందని విష్ణుప్రియ ఇష్యూ నిజం చేసింది. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో అశ్లీల కంటెంట్ పోస్ట్ చేస్తున్నారంటూ విజయవాడలో AISF నేతలు ఫిర్యాదు చేయడంతో ఈ వివాదం ముదిరింది. కానీ ఈ విషయం ఆమెకు పరోక్షంగా బాగా కలిసొచ్చిందని అంటున్నారు. AISF నాయకులు ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేయకముందు సబ్‌స్క్రైబర్ల సంఖ్య పరిమితంగానే ఉండేది. అప్పుడు సబ్‌స్క్రైబర్ల సంఖ్య 1,892 ఉండగా.. ఈ లెక్కన ఆమె నెలవారీ ఆదాయం దాదాపు రూ.7,18,960 ఉండేది.
అనూహ్యంగా వివాదం తర్వాత ఏకంగా 4,832 కు పెరిగింది. దీని ద్వారా ఆమె ప్రస్తుత ఆదాయం అక్షరాలా రూ.18,36,160 కు చేరుకుంది. కేవలం ఒక్క వివాదం వల్ల ఆమె నెలవారీ సంపాదనలో ఏకంగా ₹11 లక్షలకు పైగా భారీ పెరుగుదల కనిపించడం నెటిజన్ల కక్కుర్తికి పరాకాష్ట అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. మొత్తంగా ఈ విషయంలో కొందరు ఆమె వ్యక్తిగత స్వేచ్ఛగా భావించి మద్దతు తెలుపుతుండగా, మరికొందరు ఇలాంటి కంటెంట్ యువతపై ప్రతికూల ప్రభావం చూపుతుందని అభిప్రాయపడుతున్నారు.
Vishnu priya Dropped another banger at exclusive 🥶
— Karthi (@its_Karthi26) April 6, 2026
A thread 🧵 pic.twitter.com/o8SuD6jI0Z












Click it and Unblock the Notifications