'సంక్రాంతికి వస్తున్నాం సక్సెస్ ఓ కేస్ స్టడీ'
ప్రస్తుతం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద పాన్ ఇండియా చిత్రాల హవా కొనసాగుతోంది. బాహుబలి సినిమాతో పడిన బీజం.. అంతకంతకూ పెరిగి తీస్తే పాన్ ఇండియా సినిమానే తీయాలన్న స్థాయిలో దర్శకనిర్మాతలు లెక్కలేసుకుంటున్నారు. వందలకోట్ల బడ్జెట్ లు, సంవత్సరాల తరబడి షూటింగ్ లు, వాయిదాలు, పెద్ద పెద్ద స్టార్ క్యాస్ట్, సినిమా అనుకున్న దగ్గరనుంచి రిలీజయ్యే వరకూ ఒకటే హడావుడి, లీకులు.. తీస్తే హాలీవుడ్ రేంజ్ లో కొత్త కొత్త ప్రపంచాలు, లేదా భయపెట్టే హారర్ క్రైం థ్రిల్లర్లు.. వీటన్నింటి మధ్య సగటు ఫ్యామిలీ అంతా థియేటర్ కు వెళ్లి హాయిగా రెండు గంటలు నవ్వుకునే సినిమాలే కరవయ్యాయి. ఈ క్రమంలో ఇటీవల 'సంక్రాంతికి వస్తున్నాం' చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం ఫ్యామిలీ సినిమాలకు ఓ కేస్ స్టడీ అని డైరెక్టర్ అనిల్ రావిపూడి అంటున్నారు.
పాన్ ఇండియా మాయలో పడిపోయిన ప్రేక్షకులకు సరాదాగా రెండు గంటలు నవ్వుకునే ఫ్యామిలీ సినిమా సక్సెస్ కావడం ఎంతో అవసరమని.. ఇలాంటి మూవీస్ హిట్ అయితేనే మున్ముందు ఫ్యామిలీ మూవీస్ వస్తాయని అనిల్ రావిపూడి అభిప్రాయపడ్డారు.

పదేళ్ల ఇండస్ట్రీ..
"పదేళ్ల క్రిత పటాస్ తో నా జర్నీ మొదలు పెట్టా. అప్పుడు.. ఇప్పుడూ నన్ను ప్రోత్సహించింది మాత్రం ప్రేక్షకులే. వాళ్లు ఇచ్చిన ప్రోత్సాహంతోనే ఒక్కోమెట్టు ఎక్కుతూ ఈ స్థాయికి చేరాను. నన్ను ఇక్కడ కూర్చోపెట్టిన ప్రేక్షకదేవుళ్లకు నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. పటాస్ తో నాకు లైఫ్ ఇచ్చారు. వారికోసం ఎంటర్ టైన్ మెంట్ సినిమాలనే అందించాలని ఫిక్స్ అయ్యా. ఇక ముందూ.. అలాంటి చిత్రాలనే తీస్తాను. ఈ సంక్రాంతికి మీరు చూపించిన ప్రేమ మరువలేనిది."
"'సంక్రాంతికి వస్తున్నాం' చిత్రం వారం రోజుల్లో రూ. 200కోట్ల వసూళ్లు సాధించడం చిన్న విషయం కాదు. ఫ్యామిలీ చిత్రాలకు కూడా ఇంత మార్కెట్ ఉందని ప్రేక్షకులు నిరూపించారు. గత 30 ఏళ్లలో థియేటర్ కు రానివాళ్లు సైతం.. సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు వస్తున్నారు. ఫ్యామిలీ సినిమాలకు మార్కెట్ ఈ రేంజ్ లో ఉంటుందని ప్రేక్షకులు నిరూపించారు. ఈ పదేళ్ల జర్నీలో ప్రేక్షకుల దీవెనలు మాత్రమే పొందాను."
సంక్రాంతి సీజన్ 20శాతం వెయిటేజీ అయితే 80 శాతం వెయిటేజీ కంటెంట్ మాత్రమేనని డైరెక్టర్ అనిల్ రావిపూడి అన్నారు. పండగ సీజన్ అయినంత మాత్రాన సినిమా హిట్ అవుతుందని నేను అనుకోను. సంక్రాంతికి వస్తున్నాం మూవీ ఓ యూనిక్ కాన్సెప్ట్. అందుకే ప్రేక్షకులు ఆదరించారు. సినిమాలో కంటెంట్ ఉంది కాబట్టే హిట్ అయింది. ఈ సినిమా విజయం నా కెరీర్ లో ఎనిమిదో వండర్ అని అనిల్ రావిపూడి తెలిపారు.
ఇక 'సంక్రాంతికి వస్తున్నాం'తో థియేటర్లలో సందడి చేస్తోంది. సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా వారం రోజుల్లోనే రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.












Click it and Unblock the Notifications