అనిల్ రావిపూడి నెక్ట్స్ సినిమా టైటిల్ ఇదేనా..?
టాలీవుడ్ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి అపజయం అనేది లేకుండా దూసుకెళ్తున్నాడు. అనిల్ రావిపూడి తన ప్రస్థానాన్ని పటాస్ మూవీ నుంచి ప్రారంభించాడు. ఇప్పటివరకూ 9 సినిమాలు చేయగా అన్నీ సూపర్ హిట్ కావడం విశేషం. టాలీవుడ్ సీనియర్ హీరోలైన బాలకృష్ణ, వెంకటేశ్, చిరంజీవిలతో బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టాడు అనిల్ రావిపూడి. ఇటీవల మెగాస్టార్ చిరంజీవితో 'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రం చేశాడు. సంక్రాంతి కానుకగా ఈ మూవీ జనవరి 12 న విడుదలై రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రాబడుతోంది. సాధారణ ప్రేక్షకుల నుంచి సెలబ్రిటీల వరకూ ఈ మూవీపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి- అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన 'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రం థియేటర్లలో బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకెళ్తోంది. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ. 300 కోట్లకు పైగానే వసూళ్లు సాధించింది. ఈ మూవీలో విక్టరీ వెంకటేశ్ కీలక పాత్రలో నటించి మెప్పించిన విషయం తెలిసిందే. ఇక అనిల్ రావిపూడి తదుపరి చిత్రంపై అందరూ మాట్లాడుకుంటున్నారు. అనిల్ రావిపూడి తన నెక్ట్స్ చిత్రాన్ని అక్కినేని నాగార్జున లేదా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో తెరకెక్కిస్తాడని టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.

ఇక ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ఇప్పటికే తన 10వ సినిమాకి సంబంధించిన ఐడియాను సిద్ధం చేసినట్లు తెలిపాడు. తన 10వ సినిమాకు సంబంధించిన టైటిల్‌ను కూడా ఫిక్స్ చేసినట్లు పేర్కొన్నాడు. అది చాలా విచిత్రమైన టైటిల్ అని.. అయితే ప్రస్తుతానికి దాన్ని రివీల్ చేయడం లేదని స్పష్టం చేశాడు. ఎప్పుడైతే టైటిల్ అనౌన్స్ మెంట్ వస్తుందో అప్పటి నుంచే వీడు మళ్లీ మొదలెట్టాడురా బాబు అని అందరూ తిట్టుకోవడం పక్కా అని పేర్కొన్నాడు. ఈ సినిమా కూడా సంక్రాంతికే రిలీజ్ చేయనున్నట్లు అనిల్ రావిపూడి స్పష్టం చేశాడు.
-
‘ధురంధర్2’ దెబ్బకు ‘పుష్ప2’ రికార్డులు గల్లంతు -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
అందరి ముందు ఆమె కాళ్లు పట్టుకున్న బాలయ్య.. వీడియో వైరల్ !! -
నటుడు రాహుల్ రామకృష్ణ ఇంట్లో తీవ్ర విషాదం.. ప్రధాని మోదీకి విన్నపం! -
సాయి పల్లవి ఫ్యాన్స్‌కు షాక్: పెళ్లిపై లేడీ పవర్ స్టార్ క్లారిటీ! -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
సమంత "వావ్" వీడియో వైరల్..! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
తమిళనాడులో పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం.. విజయ్ కు బిగ్ షాక్..? -
చిరంజీవి, నాగబాబు గురించి పవన్ భార్య "అన్నా" సంచలన పోస్ట్..!












Click it and Unblock the Notifications