తృప్తి దిమ్రి బోల్డ్ ఫొటోస్ వైరల్
రణబీర్ కపూర్ హీరోగా, రష్మిక మందన్నా హీరోయిన్ గా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన యానిమల్ మూవీ బాలీవుడ్ అతిపెద్ద బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ సినిమా రూ. 900 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. బాబీ డియోల్, అనిల్ కపూర్ కీలక పాత్రల్లో నటించారు. వీరందరికన్నా ఎక్కువ పేరు తెచ్చుకున్న నటి తృప్తి దిమ్రి. దేశవ్యాప్తంగా ఆమె పేరు వింటేనే కుర్రకారు గుండె లయతప్పుతోంది. ఒక్క సినిమాతో అంత పాపులర్ అయింది. అయితే యానిమల్ సినిమా అత్యంత వివాదాస్పద చిత్రంగా పేరు తెచ్చుకుంది. చిత్ర రంగానికి చెందినవారు, రాజకీయ ప్రముఖులు కూడా సినిమా కంటెంట్ ను ఖండించారు.
ప్రేక్షకులు మాత్రం ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. ఈ చిత్రంతో తృప్తి దిమ్రి ఓవర్ నైట్ స్టార్ అయ్యింది. సినిమాలో అత్యంత బోల్డ్ రోల్ చేయడమే అందుకు కారణం. రణబీర్ కపూర్ తో శృంగార సన్నివేశాల్లో పాల్గొంది. ఒక్కసారిగా ఈమె ఎవరు అనే చర్చ సోషల్ మీడియాలో ప్రారంభమైంది. మీడియా సంస్థలైతే ఆమె ఇంటర్వ్యూ కోసం ఎదురు చూశాయి.

సినిమాలో విలన్ పంపించిన గూఢచారిగా రణబీర్ కపూర్ దగ్గరకు తృప్తి వస్తుంది. ఈ విషయాన్ని ముందే పసిగట్టిన హీరో ఆమెను తన మోజులో పడేలా చేసి విషయం తెలుసుకుంటాడు. సినిమాలో అటువంటి పాత్ర ఆమెది. పాత్ర నిడివి తక్కువే అయినప్పటికీ శృంగార సన్నివేశాల్లో నటించడంతో బాగా పేరు వచ్చింది.

బోల్డ్ ఇమేజ్ సొంతం చేసుకున్న తృప్తి దాన్ని కొనసాగిస్తోంది. గ్లామర్ ఫొటో షూట్ తో కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తోంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫొటోలు ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి. ప్రస్తుతం వైరల్ గా మారిన ఆమె ఫొటోల గురించే నెటిజన్లు చర్చించుకుంటున్నారు.












Click it and Unblock the Notifications