అమరావతిలో మెగా రైల్వే స్టేషన్: కొత్త లైన్, టెర్మినల్ ఏరియా ఫిక్స్..రూట్..!!
అమరావతి రైల్వే లైన్ పై కీలక నిర్ణయాలు జరుగుతున్నాయి. అమరావతికి రైల్వే కనెక్టివిటీ పైన ఒక నిర్ణయానికి వచ్చారు. రూట్..ప్రధాన రైల్వే స్టేషన్.. టెర్మినల్ ఏర్పాటు చేయాల్సిన ప్రాంతాల పైన దాదాపు నిర్ణయం జరిగింది. ముందుగా అనుకున్న ప్రణాళికల్లో కీలక మార్పులు చోటు చేసు కొన్నాయి. అమరావతిని ఇతర ప్రాంతాలకు కనెక్టివిటీ పెంచేలా రైలు.. రోడ్డు మార్గాల పైన ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. ఈ మేరకు రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
రాజధాని అమరావతిలో రైల్వే ప్రాజెక్టు పైన దాదాపు స్పష్టత వచ్చింది. అమరావతి కేంద్రంగా రైల్వే లైన్ కనెక్టివిటీ.. టెర్మినల్.. ప్రధాన రైల్వే స్టేషన్ పైన రైల్వే శాఖ ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. తొలుత ఖరారైన ప్రతిపాదనల ప్రకారం ఎర్రుపాలెం - నంబూరు మార్గం పొడవు 56.53 కిలోమీటర్లు కాగా, తాజా మార్పులతో ఇది 58.1 కిలోమీటర్లకు చేరింది. ఈ కారిడార్‌లో గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే అత్యాధునిక ట్రాక్‌ను నిర్మిస్తున్నారు. కృష్ణా నదిపై దాదాపు 4.5 కిలోమీటర్ల పొడవైన భారీ ఐకానిక్ వంతెనతో పాటుగా 32 మేజర్ బ్రిడ్జిలు, 92 మైనర్ వంతెనలు, 12 రోడ్ ఓవర్/అండర్ బ్రిడ్జిలకు ప్రణాళికలు సిద్దం చేసారు. అదే విధంగా ప్రధాన 'అమరావతి రైల్వే స్టేషన్' తాడికొండకు సుమారు 5 కిలోమీటర్ల దూరంలో రాజధాని కోర్ క్యాపిటల్ ప్రాంతానంలో డిసైడ్ చేసారు.

ప్రతిపాదనలు సిద్దం
అదే విధంగా 24 ఎల్‌హెచ్‌బీ (LHB) కోచ్‌లు కలిగిన సుదీర్ఘ రైళ్లను నిలిపి సర్వీసింగ్ చేసేందుకు వీలుగా కొప్పురావూరు వద్ద 230 ఎకరాల విస్తీర్ణంలో ప్రత్యేక టెర్మినల్ ఏర్పాటు కానుంది. ఇందు లో 9 ప్రధాన ప్లాట్‌ఫామ్‌లు, 6 సైడ్ లైన్లు, పిట్ లైన్లు, 12 స్టీరింగ్ లైన్లతో భారీ నిర్వహణ హబ్ సిద్ధం కానుంది. ఇందుకోసం భూమిని కేటాయించాలని రైల్వే శాఖ ఇప్పటికే ఏపీ సీఆర్డీఏ ను కోరింది. కొత్త రైల్వే లైన్లో 'పెద్దాపురం, చెన్నారావు పాలెం, గొట్టుముక్కల, పరిటాల, కొత్తపల్లి, వడ్డమాను, అమరావతి, తాడికొండ, కొప్పురావూరు' రైల్వేస్టేషన్లు రానున్నాయి. వీటిలో పెద్దా పురం, పరిటాల, అమరావతి, కొప్పురావూరు వద్ద క్రాసింగ్ స్టేషన్లకు నిర్ణయించారు. భవిష్యత్ లో ఎర్రబాలెం, నంబూరు స్టేషన్లు జంక్షన్లుగా మారనున్నాయి.













Click it and Unblock the Notifications
