ఎల్లుండి నుంచి రూ. 50 లతో..తిరుమలలో.. !!

ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమల మహత్యాన్ని, శ్రీ వేంకటేశ్వర స్వామివారి దివ్య చరిత్రను భక్తులకు కళ్లకు కట్టినట్లు వివరించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం నూతనంగా ఆధునీకరించిన ఎస్వీ మ్యూజియం ట్రయల్ రన్ చివరిదశకు చేరుకుంది. అత్యాధునిక డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానంతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన ఈ మ్యూజియం ట్రయల్ రన్.. ఈ నెల 15వ తేదీ ఆదివారం వరకు కొసాగనుంది. ప్రపంచ నలుమూలల నుంచి వచ్చే శ్రీవారి భక్తులకు పూర్తిస్థాయిలో దీనిని ప్రారంభించడానికి ముందుగా ఈ ట్రయల్ రన్ చేపట్టింది టీటీడీ.

ఈ సమయంలో ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మ్యూజియం సందర్శనకు అనుమతించారు. టీటీడీ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, తిరుమల, తిరుపతికి చెందిన ప్రింట్, ఎలక్ట్రానిక మీడియా ప్రతినిధులు, వారి కుటుంబాలు ఈ మ్యూజియాన్ని సందర్శించవచ్చు. శ్రీవారి సేవకులు, టీటీడీ ఆధ్వర్యంలో నడిచే విద్యాసంస్థలతో పాటు ఇతర పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకుంటోన్నారు.

Trial run of the newly modernised Sri Venkateswara Museum in Tirumala opened to devotees from Nov 16

ట్రయల్ రన్ పూర్తయిన మరుసటి రోజు నుంచే ఈ నెల 16వ తేదీ సోమవారం నుండి సాధారణ భక్తులను మ్యూజియం సందర్శనకు అనుమతించనుంది టీటీడీ. ఈ మ్యూజియం ఎంట్రీ ఫీజు 50 రూపాయలుగా నిర్ధారించారు. మ్యూజియం తిలకించాలనుకునే ప్రతి ఒక్క భక్తుడు కూడా ఈ 50 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.

అలిపిరి కాలిబాట మార్గంలో ఇకపై..
అలిపిరి కాలిబాట మార్గంలో ఇకపై..

అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా రూపుదిద్దుకున్న ఈ ఎస్వీ మ్యూజియంలో స్వామివారి నిత్య సేవలు, ఉత్సవాల ప్రాశస్త్యాన్ని తెలిపే అరుదైన ఛాయాచిత్రాలు, ప్రాచీన ఆభరణాల నమూనాలు, చారిత్రక నాణేలు, రాగిరేకులు, రాతి శిల్పాలను ప్రదర్శనకు ఉంచారు. భక్తులకు నూతన తరహా ఆధ్యాత్మిక అనుభూతిని పంచేందుకు వర్చువల్ రియాలిటీ సాంకేతికత, 3డీ ప్రొజెక్షన్ మ్యాపింగ్, ఇంటరాక్టివ్ కియోస్క్‌, డిజిటల్ స్క్రీన్లను అందుబాటులోకి తెచ్చారు.

ప్రస్తుతం చేపట్టిన ఈ ట్రయల్ రన్ ద్వారా మ్యూజియంలో ఏర్పాటు చేసిన వివిధ డిజిటల్ సాంకేతిక పరికరాల పనితీరు, సందర్శకుల రద్దీ నిర్వహణను టీటీడీ పరిశీలిస్తోంది. ప్రదర్శనను తిలకించిన వివిధ వర్గాల నుంచి స్వీకరించే అభిప్రాయాలు, సూచనల ఆధారంగా ఇందులో అవసరమైన చిన్న మార్పులు చేయనున్నారు. అనంతరం 16వ తేదీ నుంచి తిరుమలకు విచ్చేసే సామాన్య భక్తులకు మ్యూజియం ప్రవేశాన్ని అందుబాటులోకి తీసుకుని వస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+