సంచలనం: రూ.కోట్లు వెదజల్లిన తృప్తి దిమ్రి!
రణబీర్ కపూర్ కథానాయకుడిగా, రష్మిక మందన్నా కథానాయికగా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన యానిమల్ మూవీ బాలీవుడ్ అతిపెద్ద బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ సినిమా రూ. 900 కోట్లకు పైగా భారీ వసూళ్లను రాబట్టింది. బాబీ డియోల్, అనిల్ కపూర్ కూడా కీలక పాత్రల్లో నటించినప్పటికీ వీరందరికన్నా ఎక్కువ పేరు తెచ్చుకుంది మాత్రం తృప్తి దిమ్రి. దేశవ్యాప్తంగా ఆమె పేరు వింటేనే కుర్రకారు నిద్ర కూడా పోవడంలేదు. గతం నుంచే సినిమాలు చేస్తున్నప్పటికీ ఈ ఒక్క సినిమాతో అంత పాపులర్ అయింది.
రక్తికట్టిన శృంగార సన్నివేశాలు
వివాదాలు రేకెత్తినప్పటికీ ప్రేక్షకులు మాత్రం ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. ఈ చిత్రంతో తృప్తి దిమ్రి ఓవర్ నైట్ స్టార్ అయ్యిందంటే అందుకు కారణం సినిమాలో అత్యంత బోల్డ్ రోల్ చేయడమే. రణబీర్ కపూర్ తో శృంగార సన్నివేశాల్లో పాల్గొని వాటిని రక్తికట్టించింది. తాజాగా ఈ అమ్మడు ముంబయిలో ఖరీదైన ప్రాంతమైన బాంద్రాలో అత్యంత ఖరీదైన రెండంతస్తుల బంగ్లాను కొనుగోలు చేసింది.

ఆశ్చర్యపోతున్న సినీవర్గాలు
రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్, సల్మాన్, షారుక్ లాంటి స్టార్ హీరోలు అక్కడే నివసిస్తుంటారు. సుమారు 257 గజాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఇల్లు దాదాపు రూ.14 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది. స్టాంప్ డ్యూటీ కింద రూ.70 లక్షలు, రిజిస్ట్రేషన్‌కు రూ. 30 లక్షలు ఇచ్చింది. ఇప్పుడు ఈ వార్త సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంంది. దీంతో అందరూ అంత ఖరీదైన బంగ్లాను కొనుగోలు చేయడంపై ఆశ్చర్యపోతున్నారు. మోడలింగ్ రంగంలో అడుగుపెట్టినయి ఈ అమ్మడు.. మామ్ పోస్టర్, బాయ్స్, లైలా మజ్ను లాంటి సినిమాల్లో నటించింది. కానీ బుల్బుల్ సినిమాతో ఫేమస్ అయినా త్రిప్తి యానిమల్ తో పాన్ ఇండియా లెవెల్ లో అద్భుతమైన క్రేజ్ ను సొంతం చేసుకుంది.












Click it and Unblock the Notifications