'యానిమల్' మూవీ ఆల్ టైం రికార్డ్
రణ్ బీర్ కపూర్, రష్మిక హీరో హీరోయిన్లుగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన యానిమల్ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎంతటి ప్రభంజనాన్ని సృష్టించిందో చూశాం. రూ.900 కోట్ల కు కలెక్షన్లు రాబట్టింది. బాలీవుడ్ పరిశ్రమలోనే కాకుండా రణబీర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. తాజాగా ఈ సినిమా ఎవరికీ సాధ్యంకాని రీతిలో మరో అరుదైన రికార్డును సృష్టించింది.
థియేటర్లలో సృష్టించిన రికార్డులతో తృప్తి చెందుకుండా యానిమల్ మూవీ ఓటీటీలోను రికార్డులు క్రియేట్ చేస్తోంది. వ్యూస్ పరంగా ఆల్ టైం రికార్డు నెలకొల్పింది. నెట్ ఫ్లిక్స్ ఈ సినిమాను అన్ని భాషల్లో స్ట్రీమింగ్ కు తీసుకువచ్చింది. 39.3 మిలియన్ల వ్యూయర్ షిప్ ను సొంతం చేసుకుంది. గతంలో 10 రోజుల్లో ఆర్ఆర్ఆర్ సినిమా 25.5కోట్ల వ్యూయర్ షిప్ ను రాబట్టింది. తాజా సంచలనం జవాన్ 11రోజుల్లో 25.5 కోట్ల వ్యూయర్ షిప్ ను అందుకుంది.

యానిమల్ సినిమా ఈ రెండింటినీ అధిగమించి మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. సలార్ కూడా మంచి వ్యూయర్ షిప్ నే సొంతం చేసుకున్నప్పటికీ హిందీ వెర్సన్ విడుదల లేకపోవడంతో యానిమల్ కు పోటీనివ్వలేకపోయింది. ట్రెండింగ్ లో మన దేశంలో యానిమల్ మొదటి స్థానంలో కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా మూడోస్థానంలో నిలిచింది. కబీర్ సింగ్ సినిమా తర్వాత సందీప్ రెడ్డి వంగా రణబీర్ కపూర్-రష్మిక కాంబినేషన్ లో తీసుకువచ్చిన యానిమల్ సినిమాకు హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించగా, టి సిరీస్, భద్రకాళి పిక్చర్స్ నిర్మించాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి దర్శకుడు సందీప్ కు, బాలీవుడ్ నటులకు మధ్య మాటల వివాదం కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications