త్వరలోనే అనిరుధ్ -కావ్య మారన్ పెళ్లి.. లీక్ చేసిన నటుడు మహేంద్రన్ !!
ప్రస్తుతం భారతీయ సినిమా పరిశ్రమలోని సంగీత దర్శకుల గురించి మాట్లాడితే మొదట గుర్తొచ్చే పేరు అనిరుధ్ రవిచందర్. కేవలం ఒక మ్యూజిక్ డైరెక్టర్ లాగానే కాకుండా.. సినిమాకు అదనపు బలంగా , ప్రేక్షకులకు థియేటర్ కి రప్పించే బ్రాండ్‌గా ఎదిగారు. ఒకప్పుడు తమిళ సినిమాలకే పరిమితమైన ఈ యువ సంగీత దర్శకుడు.. ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో అత్యంత డిమాండ్ ఉన్న కంపోజర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన పేరు పోస్టర్‌పై కనిపిస్తే చాలు.. సినిమా పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఎలా ఉండబోతుందోననే ఆసక్తి ప్రేక్షకుల్లో మొదలవుతోంది.
అనిరుధ్ - కావ్యా మారన్‌తో పెళ్లి..
సినిమాల్లో వరుస విజయాలతో దూసుకుపోతున్న అనిరుధ్ వ్యక్తిగత జీవితం కూడా గత కొంతకాలంగా వార్తల్లో నిలుస్తోంది. ముఖ్యంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ఫ్రాంచైజీ అధినేత, సన్ గ్రూప్ వారసురాలు కావ్యా మారన్‌తో ఆయన వివాహం జరగబోతోందంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. ఈ ఇద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు కొంతకాలంగా వైరల్ అవుతున్నప్పటికీ.. ఇప్పటివరకు ఇరువర్గాల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

తాజాగా తమిళ సీనియర్ నటుడు వై.జి. మహేంద్రన్ చేసిన వ్యాఖ్యలు ఈ వార్తలకు మరింత ఊతమిచ్చాయి. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన.. "అనిరుధ్ చాలా సాఫ్ట్ బాయ్. ఎంతో ప్రతిభావంతుడు. కానీ ఏదో ఒక కారణం వల్ల ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదు. త్వరలోనే ఆ అడ్డంకులు తొలగిపోతాయని ఆశిస్తున్నాను. నేను కూడా విన్నదాన్ని బట్టే చెబుతున్నాను. అనిరుధ్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడు. అతనికి నా శుభాకాంక్షలు అని వ్యాఖ్యానించారు.
అంతే కాకుండా ఇంటర్వ్యూలో కావ్యా మారన్ గురించి కూడా వై.జి. మహేంద్రన్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఆమె కేవలం ఐపీఎల్ జట్టు యజమాని మాత్రమే కాదని.. వ్యాపార రంగంలో కూడా అసాధారణ ప్రతిభ కలిగిన మహిళ అని కొనియాడారు. తండ్రి కళానిధి మారన్ వ్యాపార దక్షతను పూర్తిగా అందిపుచ్చుకున్నారని ప్రశంసించారు. ఇంటర్వ్యూ చివర్లో వై.జి. మహేంద్రన్ సరదాగా మాట్లాడుతూ.. "స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్, వ్యాపార రంగంలో దూసుకుపోతున్న కావ్యా మారన్.. ఇద్దరూ పెళ్లి చేసుకుంటే ఇక మ్యూజికల్ బిజినెస్ చేస్తారేమో" అంటూ నవ్వుతూ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.
'కొలవెరి డి'తో సెన్సేషన్..
అనిరుధ్.. ఐశ్వర్యా రజనీకాంత్ దర్శకత్వంలో ధనుష్ నటించిన '3' సినిమాతో సంగీత దర్శకుడిగా అరంగేట్రం చేసి మొదటి సినిమాతోనే చరిత్ర సృష్టించారు. ధనుష్ ఆలపించిన "Why This Kolaveri Di" పాట ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయి.. భారతీయ సంగీత చరిత్రలోనే కొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టింది. యూట్యూబ్ రికార్డులు బద్దలవ్వడం, అంతర్జాతీయ మీడియాలో సైతం ఈ పాట గురించి చర్చ జరగడం, అనిరుధ్‌ను ఒక్కసారిగా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్‌గా మార్చేసింది. ఆ తర్వాత వరుసగా తమిళంలో 'వీఐపీ', 'కత్తి', 'పేట', 'మాస్టర్', 'బీస్ట్', 'విక్రమ్', 'జైలర్', 'లియో' వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలకు సంగీతం అందించి తన స్థాయిని మరింత పెంచుకున్నారు.
Unofficially confirmed by official Family Member of #Rajinikanth & #Anirudh 🕺💥pic.twitter.com/1mNDFCUWt9
— SillakiMovies (@sillakimovies) June 28, 2026
టాలీవుడ్‌లోకి 'అజ్ఞాతవాసి'తో గ్రాండ్ ఎంట్రీ..
తమిళంలో సూపర్ హిట్లతో దూసుకుపోతున్న సమయంలో స్టార్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'అజ్ఞాతవాసి' సినిమాతో అనిరుధ్‌ను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారు. 2018లో విడుదలైన ఈ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోకపోయినా.. అనిరుధ్ అందించిన సంగీతం మాత్రం అద్భుతమైన స్పందనను అందుకుంది. "బైటకొచ్చి చూస్తే", "గాలివాలుగా", వంటి పాటలు సంగీత ప్రియులను అలరించగా.. పవన్ కళ్యాణ్ స్వయంగా పాడిన "కొడకా కోటేశ్వరరావు" పాట సోషల్ మీడియాలో సెన్సేషన్ అయింది.
'జెర్సీ'తో భావోద్వేగాలకు ప్రాణం.. 'గ్యాంగ్ లీడర్'తో మరో హిట్
అలానే 2019లో నేచురల్ స్టార్ నాని నటించిన 'జెర్సీ' సినిమాతో అనిరుధ్ మరోసారి తన ప్రతిభను నిరూపించారు. ఈ సినిమాలోని పాటలు ఇప్పటికీ ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయాయి. ముఖ్యంగా క్లైమాక్స్‌లో వినిపించే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది. సినిమా చూసిన ప్రేక్షకులు కథతో పాటు అనిరుధ్ సంగీతాన్ని కూడా ప్రత్యేకంగా ప్రశంసించారు. అదే ఏడాది విడుదలైన 'గ్యాంగ్ లీడర్' చిత్రంలో "హోయ్ నా "వంటి పాటలతో యూత్‌ను ఆకట్టుకున్నారు. క్లాస్ మెలోడీలు, క్యాచీ బీట్స్ రెండింటినీ సమానంగా అందించగలరని మరోసారి నిరూపించారు.
'దేవర'తో పాన్ ఇండియా ర్యాంపేజ్..
ఇక టాలీవుడ్‌లో అనిరుధ్ కెరీర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లిన సినిమా 'దేవర'. గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ తెరకెక్కించిన ఈ చిత్రంలో అనిరుధ్ అందించిన సంగీతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. "ఫియర్ సాంగ్" విడుదలైన క్షణం నుంచే అభిమానుల్లో ఊపు తెచ్చింది. ఎన్టీఆర్ మాస్ ఇమేజ్‌కు తగ్గట్టుగా కంపోజ్ చేసిన ఈ పాట థియేటర్లలో అభిమానులతో పూనకాలు తెప్పించింది. ఇక "చుట్టమల్లె" పాట ప్రపంచవ్యాప్తంగా రీల్స్, షార్ట్స్‌లో వైరల్ అయి కోట్లాది వ్యూస్ సాధించింది.
కాగా పాటలు మాత్రమే కాకుండా.. సినిమా మొత్తం కథనాన్ని తన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో మరో స్థాయికి తీసుకెళ్లగలిగే అరుదైన సంగీత దర్శకుల్లో అనిరుధ్ ఒకరు. అందుకే ఇప్పుడు టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అన్న తేడా లేకుండా స్టార్ హీరోలందరి తొలి ఎంపికగా మారిపోయారు. ప్రస్తుతం అనిరుధ్ చేతిలో పలు భారీ సినిమాలు ఉన్నాయి. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో అగ్ర హీరోల సినిమాలకు ఆయన సంగీతం అందిస్తున్నారు. నిర్మాతలు, దర్శకులు సైతం సినిమా షూటింగ్ కంటే ముందు అనిరుధ్ డేట్స్ ఖరారు చేసుకోవడానికే ప్రాధాన్యం ఇస్తున్నారంటే ఆయన మార్కెట్ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది.












Click it and Unblock the Notifications