తమన్నా భాటియాపై మళ్లీ నోరుజారిన సీనియర్ నటుడు!

సీనియర్ బాలీవుడ్ నటుడు అన్నూ కపూర్ ప్రముఖ కథానాయిక తమన్నా భాటియాపై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. గతంలో ఆమెను ఉద్దేశించి చేసిన కామెంట్లపై మళ్లీ స్పందించిన ఆయన.. సరికొత్త కామెంట్స్ చేసి నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు.

ఓటీటీలోకి వరుణ్ తేజ్ సూపర్ హిట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఓటీటీలోకి వరుణ్ తేజ్ సూపర్ హిట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

'పాల శరీరం'కామెంట్స్‌పై వింత వివరణ
గతంలో ఓ పాడ్‌కాస్ట్‌లో తమన్నా గురించి మాట్లాడుతూ.. "మాషాఅల్లా.. ఎంత పాలలాంటి శరీరం" అని అన్నూ కపూర్ అన్నారు. దీనిపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం కావడంతో ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. భారతీయులు ఇప్పటికీ మానసిక బానిసత్వంలోనే ఉన్నారని.. ఆంగ్లంలో పొగిడితే గొప్పగా భావించే జనాలు.. హిందీలో మాట్లాడితే తప్పుబడుతున్నారని ఆయన విమర్శించారు. ఒకరి శరీరం పాలలా తెల్లగా ఉందనడంలో ఎలాంటి తప్పు లేదని ఆయన సమర్థించుకున్నారు.

Annu Kapoor Backlashed Over Controversial Remarks On Tamannaah Bhatia Response on Milky Body Remark

పెళ్లి కాకుండానే ఆశీర్వాదం
ఇంటర్వ్యూ కొనసాగుతుండగా.. తమన్నా భాటియా బాగుందా? ఆరోగ్యంగా ఉందా? అని ఆరా తీసిన అన్నూ కపూర్.. దేవుడు ఆమెకు ఎల్లప్పుడూ సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని ప్రసాదించాలని దీవించారు. అయితే హోస్ట్ కలగజేసుకుని తమన్నాకు ఇంకా పెళ్లి కాలేదని చెప్పడంతో ఆయన వెంటనే మాట మార్చి.. ఎప్పుడూ మంచి జరగాలని ఆశీర్వదిస్తున్నట్లు చెప్పారు.

'టాక్సిక్' విధ్వంసం... 4 రోజుల్లోనే రాజమౌళి 'RRR' రికార్డు అవుట్!
'టాక్సిక్' విధ్వంసం... 4 రోజుల్లోనే రాజమౌళి 'RRR' రికార్డు అవుట్!

సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం
అన్నూ కపూర్ మాట్లాడిన తీరుపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఆయన కామెంట్స్ చవకబారుగా, గౌరవప్రదంగా లేవని పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వయస్సుకు తగ్గ సంయమనం లేకుండా.. బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారంటూ ఆయనను సోషల్ మీడియా వేదికగా విమర్శిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+