తెలుగు పరిశ్రమలో విడిపోతున్న మరో జంట?
తెలుగు సినీ పరిశ్రమలో ప్రేమించుకోవడం.. పెళ్లి చేసుకోవడం.. విడాకులు తీసుకోవడం అనేది సర్వ సాధారణమైన విషయంలా మారిపోయింది. ప్రేమించుకునే సమయంలోనే ఇద్దరిపై పూర్తిస్థాయిలో అవగాహన ఉండాలి.. అనుబంధం ఉండాలి. అలా అయితేనే ఆ బంధం నాలుగు కాలాలు నిలుస్తుంది. అలా కాకుండా ఏదో టైంపాస్ కి వేరుశనగకాయలు తిన్నట్లుగా టైంపాస్ కి ప్రేమించుకోవడాలు చేస్తే అవి నాలుగు రోజులు కూడా నిలవవు. తాజాగా టాలీవుడ్ లో మరో ప్రేమజంట విడిపోవడానికి సిద్ధమైంది.
నాగచైతన్య, సామ్ ను మించిపోయారు
హీరో, హీరోయిన్.. ఇద్దరూ ప్రేమించుకున్నారు. పరిశ్రమలోకి రావడమే మొదటి సినిమాలో వీరిద్దరూ కలిసి నటించారు. అదే సమయంలో ఇద్దరూ ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత ఈ హీరో కొన్ని సినిమాల్లో బాగానే నటించారుకానీ క్రేజ్ ను తెచ్చుకోలేకపోయారు. ఆ హీరోయిన్ మాత్రం అడపా దడపా సినిమాల్లో నటిస్తూ సెకండ్ హీరోయిన్ గా కొనసాగుతూ వస్తోంది. తాజాగా ఈ బ్యూటీ క్రేజ్ పెరిగిపోయింది. సరిగ్గా ఇటువంటి తరుణంలోనే అతడికి బ్రేకప్ చేప్పేసిందని తెలుస్తోంది. దీంతో వీరి ప్రేమ పెళ్లి వరకు వెళ్లకుండానే పెటాకులైందంటున్నారు టాలీవుడ్ జనాలు. వీరు ప్రేమించుకునే సమయంలో నాగచైతన్య, సమంతను మించిన రేంజ్ లో రొమాన్స్ చేసి పేరు కూడా తెచ్చుకున్నారు.

ఇద్దరికీ అంగీకారమేనా?
ఈ అమ్మడుకు ప్రస్తుతం క్రేజ్ నెమ్మది నెమ్మదిగా పెరుగుతుండటంతో ఆమె స్థాయికి అతను సరితూగలేకపోతున్నాడని, అందుకే బ్రేకప్ చెప్పేసిందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అయితే ఈ హీరోయిన్ తనంతట తానుగా బ్రేకప్ చెప్పిందా? ఇద్దరూ ఒక మాట అనుకొని బ్రేకప్ చెప్పుకున్నారా? విడిపోవడం అనేది ఇద్దరికీ ఇష్టమేనా? అనే విషయంలో మాత్రం స్పష్టత రావడంలేదు. తెలుగు పరిశ్రమలోనే కాకుండా సమాజంలో కూడా ప్రేమించుకోవడం.. పెళ్లి కాకముందే విడిపోవడం అనేది సాధారణమైన విషయాలుగా మారిపోయాయని, మన భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలను అందరూ విస్మరిస్తున్నారని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.












Click it and Unblock the Notifications