పుష్ప 2 నుంచి మరో క్రేజీ అప్‌డేట్.. త్వరలోనే సెకండ్ సాంగ్ విడుదల..!
పుష్ప చిత్రంతో అల్లుఅర్జున్ క్రేజీ మరింత పెరిగిపోయింది. ఈ సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే..! ఇక, పుష్ప 2 సినిమాపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. అందుకే ఈ సినిమా గురించి ఏ చిన్న న్యూస్ వచ్చినా అది క్షణాల్లో వైరల్ అవుతుంది. ఇటీవలే పుష్ప 2 నుంచి ఫస్ట్ సాంగ్ రీలీజయ్యి రికార్డుల మోత మోగించింది. ఇప్పుడు తాజాగా, మరో సాంగ్ రిలీజ్ అవుతున్నట్లు నెట్టింట తెగ వార్తలు వస్తున్నాయి.
సుకుమార్ దర్శకత్వంలో వస్తోన్న పుష్ప సినిమా భారీ విజయాన్నే అందుకుంది. ఇక, పుష్ప2 సినిమాపై కూడా అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. పుష్ప సినిమాలో రష్మిక మందన్న శ్రీవల్లీ పాత్రలో మెరిసిన సంగతి తెలిసిందే. పుష్ప 2 లో కూడా అల్లుఅర్జున్ భార్యగా నటిస్తోంది. పుష్ప 2 నుండి ఇటీవలే పుష్ప.. పుష్ప.. పుష్పరాజ్ అంటూ వచ్చిన ఈ పాట సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. రీలిజయిన కొన్ని గంటల్లోనే ఎక్కువ వ్యూస్, లైక్స్ సాధించిన సాంగ్ గా పుష్ప 2 పాట రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఇక ఈ పాటలో అల్లు అర్జున్ వేసిన స్టెప్స్‌కి అభిమానులు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఎక్కడా చూసిన ఈ పాటే కనిపిస్తోంది.. వినిపిస్తోంది అంతగా మారుమోగుతుంది ఈ పాట.

జూన్‌లో రెండోపాట విడుదలకు సర్వం సిద్ధం..
ఇక, ఇప్పడు ఈ సినిమా నుండి మరో పాటను రీలీజ్ చేసేందుకు మూవీ మేకర్స్ సిద్ధంగా ఉన్నట్లు తెలిసింది. మొదటి పాటకి వచ్చిన క్రేజ్ చూసి పుష్ప మేకర్స్ ఫుల్లు హ్యాపీ గా ఫీలవుతున్నట్లు తెలుస్తోంది. అందుకే ఈ సినిమాను నుంచి రెండో పాటను రీలీజ్ చేసి అభిమానులకు సర్ప్రైజ్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం వచ్చిన సమాచారం మేరకు జూన్ లో పుష్ప 2 సెకండ్ సాంగ్ విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన కూడా వెలువడనుందట..!












Click it and Unblock the Notifications