నందమూరి వంశం నుంచి మరో NTR ఎంట్రీ.. గ్రాండ్ గా కొత్త సినిమా ప్రారంభం
నందమూరి వంశం నుంచి మరో యంగ్ హీరో రాబోతున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ అన్న స్వర్గీయ జానకీ రామ్ కుమారుడు నందమూరి తారక రామారావు హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఇవాళ ఈ చిత్రం పూజా కార్యక్రమం నిర్వహించారు. నారా భువనేశ్వరి క్లాప్ కొట్టి నటీనటులకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ చిత్రానికి వై.వి.ఎస్.చౌదరి దర్శకత్వం వహిస్తున్నాడు. అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని అన్ని హంగులతో నిర్మించనున్నారు.

నందమూరి వంశం నుంచి నాలుగో తరం వారసుడు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. స్వర్గీయ నందమూరి హరికృష్ణ మనవడు, స్వర్గీయ జానకిరామ్ కుమారుడు హీరోగా కొత్త సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఇవాళ అంగరంగ వైభవంగా జరిగాయి. నారా భువనేశ్వరి ఈ చిత్రానికి క్లాప్ కొట్టారు. అనంతరం నటీనటులకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. నందమూరి తారక రామారావు హీరోగా ఈ చిత్రానికి వై.వి.ఎస్.చౌదరి దర్శకత్వం వహిస్తున్నాడు.
NTR's First Speech. pic.twitter.com/1LogfYbmPx
— Gulte (@GulteOfficial) May 12, 2025
ఈ పూజా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భువనేశ్వరి, లోకేశ్వరి, పురందేశ్వరిలతో పాటు ఎన్టీఆర్ ఫ్యామిలీ సభ్యులు తరలివచ్చారు. యువ హీరో నందమూరి తారక రామారావును ఆశీర్వదించారు. ఇక యలమంచలి గీతా ఎన్టీఆర్ (న్యూ టాలెంట్ రోర్స్) బ్యానర్‌పై ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు ప్రణాళికలు సిద్దం చేశారు. ఇక ఈ చిత్రంలో వీనా రావు అనే అచ్చమైన తెలుగమ్మాయి హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనుంది.
#NTR - Veenah - NEW FILM Under #YVSChowdary Direction - NEW TALENT is Coming to TOLLYWOOD.
— GetsCinema (@GetsCinema) May 12, 2025
pic.twitter.com/FnvUxot4sX
ఇక డైరెక్టర్ వై.వి.ఎస్.చౌదరికి నందమూరి వంశంతో మంచి సంబంధాలు ఉన్నాయి. శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమయ్యారు. ఆ తర్వాత అక్కినేని నాగార్జున, నందమూరి హరికృష్ణ హీరోలుగా సీతారామరాజు తీశారు. మహేష్ బాబు హీరోగా యువరాజు సినిమాను తెరకెక్కించాడు. ఆ తర్వాత లాహిరి లాహిరి లాహిరిలో, సీతయ్య, దేవదాసు, ఒక్క మగాడు, సలీమ్, రేయ్ సినిమాలకు దర్శకత్వం వహించాడు. చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు వై.వి.ఎస్.చౌదరి.












Click it and Unblock the Notifications