విడాకులు తీసుకోబోతున్న తెలుగు స్టార్ హీరో?
తెలుగు సినీ పరిశ్రమలో విడాకులు తీసుకోవడం అనేది సర్వసాధారణమైపోయింది. హీరో హీరోయిన్లే కాదు.. దర్శకులు, నిర్మాతలు, క్యారెక్టర్ ఆర్టిస్టులు, కెమెరామెన్లు... ఇలా 24 విభాగాలకు సంబంధించినవారు ఎవరో ఒకరు ప్రేమించి పెళ్లి చేసుకోవడం.. తర్వాత అభిప్రాయాలు కలవలేదంటూ విడిపోవడం సహజమైపోయింది. ప్రేమించుకున్నప్పుడు కలిసి అభిప్రాయాలు పెళ్లయిన తర్వాత ఎందుకు కలవడంలేదో వారికే తెలియాలి.. లేదంటే వారిని పుట్టించిన బ్రహ్మదేవుడికైనా తెలియాలి. మరెవరికీ తెలియదు. నాలుగు నెలలు కాపురం చేయడం.. తర్వాత విడిపోవడం. నాగచైతన్య-సమంత విడిపోవడం ఎంత దుమారం రేపిందో చూశాం. తాజాగా తెలుగు పరిశ్రమకు చెందిన ఓ స్టార్ హీరో విడాకులు తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.
ప్రేమకథలతో సినిమాలు చేయగా..
మంచి యంగ్ హీరో అయిన ఇతను ప్రారంభంలో చిన్న చిన్న సినిమాలు చేశాడు. అయినా గుర్తింపు రాలేదు. ఆ తర్వాత మంచి ప్రేమకథతో ఓ సినిమా చేశాడు. అది సూపర్ హిట్ అయింది. హీరో కూడా అందంగా ఉంటాడు కాబట్టి అమ్మాయిల్లో మంచి క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత చేసిన సినిమాలు కూడా మంచి విజయాన్నే దక్కించుకున్నాయి. ప్రేమ కథా చిత్రాల హీరోగా ఉన్న అతను మాస్ హీరోగా మారాలనుకున్నాడు. దీంతో మాస్ ఇమేజ్ కోసం మాస్ సినిమాలతో ఓ ప్రేమ కథతో సినిమా తీయగా అది కూడా మంచి విజయాన్ని నమోదు చేసింది.

బ్లాక్ బస్టర్ పడితేనే నిలిచే పరిస్థితి
ఈ సినిమా విజయం సాధించడంతో ఇదే తరహాలో మరో మూడు సినిమాలు తీయగా అవన్నీ పెద్ద డిజాస్టర్లుగా నిలిచాయి. ఇటీవలే ఓ పెద్ద సంస్థలో సినిమా చేయగా దానికి మంచి టాక్ వచ్చినప్పటికీ ఎందుకనే సరిగా ఆడలేదు. తర్వాత కొత్త ప్రొడ్యూసర్ తో సినిమా తీయడానికి అన్నీ సిద్ధం చేశాడుకానీ బడ్జెట్ సమస్య కావడంతో ఆగిపోయింది. దీంతో అది ఎప్పుడు పట్టాలెక్కుతుందో అర్థం కాక మరో బ్యానర్ లో సినిమా చేయడానికి అంగీకారం తెలిపాడుకానీ అది ఎప్పుడు పూర్తవుతుందో అర్థం కాని పరిస్థితి. ప్రస్తుతం ఆ హీరో పరిస్థితి ఎలా ఉందంటే మంచి సూపర్ హిట్ ఒక్కటి కొడితేనే వరుసగా సినిమాలు చేసే పరిస్థితి ఉంది.
త్వరలోనే అధికారికంగా చెప్పనున్నాడు
కొద్ది సంవత్సరాల క్రితం ఓ అమ్మాయిని ఇష్టపడి కులాంతర వివాహం చేసుకున్నాడు. ఈ హీరో ఎప్పుడూ తన కుటుంబానికి సంబంధించి, లేదంటే తన వ్యక్తిగత విషయాలకు సంబంధించినవి ఏవీ బయటకు చెప్పేవాడు కాదు. తాజాగా భార్యతో మనస్పర్థలు వచ్చినట్లు తెలుస్తోంది. దీనివల్ల ఆ హీరో డిప్రెషన్ కు లోనయ్యారు. త్వరలోనే వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. అతి త్వరలోనే దీనిపై ఆ హీరో అధికారికంగా వెల్లడించనున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications