గ్లామర్ ట్రీట్‌తో అదరగొట్టిన రోజా కూతురు
తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర కథానాయికగా వెలిగి, ఆ తర్వాత రాజకీయాల్లో ఎమ్మెల్యేగా, మంత్రిగా సత్తా చాటిన రోజా సెల్వమణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే, ఇప్పుడు చర్చ అంతా రోజా వారసురాలు, ప్రతిభావంతురాలు అన్షు రెడ్డి గురించే.
చిన్ననాటి నుంచే రచయిత్రిగా గోల్డ్ మెడల్స్ సాధించిన అన్షు, ఇటీవల తన గ్లామరస్ లుక్‌తో సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ఆమె అచ్చం తల్లి రోజాకు జిరాక్స్ కాపీలా కనిపించడమే దీనికి ప్రధాన కారణం. ఇటీవల ఒక ఈవెంట్‌లో హీరోయిన్లను తలపించేలా ర్యాంప్ వాక్ చేసిన అన్షు రెడ్డి, ఆ తర్వాత తన సోషల్ మీడియాలో షేర్ చేసిన ట్రెండీ ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి.

స్లీవ్‌లెస్ షర్ట్, బుడ్డి నిక్కరు వంటి ట్రెండీ దుస్తుల్లో క్లీవేజ్ షోతో అన్షు వదిలిన ఫొటోలు ఫ్యాన్స్‌కు గట్టి షాకే ఇచ్చాయి. ఆమెను చూసిన అభిమానులు, ఇది వింటేజ్ రోజా లుక్.. రోజా ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలో ఇలానే ఉండేవారని అభిప్రాయపడుతున్నారు.అన్షు అందంపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ..ఇంత అందంగా ఉందేంటి బాబోయ్, రోజా కూడా ఈమె అందం ముందు సరితూగదంటూ కామెంట్లతో ముంచెత్తుతున్నారు.
అన్షు రెడ్డికి హీరోయిన్ మెటీరియల్ అనడంలో ఎలాంటి సందేహం లేదని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఆమె అందం, స్క్రీన్ ప్రెజెన్స్ కొత్తగా ఎంట్రీ ఇస్తున్న హీరోయిన్ల కంటే మరింత ఆకర్షణీయంగా ఉన్నాయని వారు అభిప్రాయపడుతున్నారు. నటన, డ్యాన్స్ ప్రతిభ కనుక తోడైతే, ఆమెను ఇండస్ట్రీలో ఆపడం కష్టమని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం అన్షు ఫొటోలు సోషల్ మీడియాను ఊపేస్తుండగా, ఆమె సినీ రంగ ప్రవేశం ఎప్పుడు, ఏ సినిమాతో జరుగుతుందో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ గ్లామరస్ ట్రీట్‌తో, ఇండస్ట్రీలో అన్షు ఎంట్రీ పక్కా అని ఫ్యాన్స్ గట్టిగా కామెంట్స్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications