ట్రైలర్ లోనే ఇంత కామెడీ ఉంటే.. మూవీలో ఇంకెంత కామెడీ ఉందో..!
డీజే టిల్లు మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న దర్శకుడు విమల్ కృష్ణ. 2022 లో వచ్చిన ఈ క్రైమ్ కామెడీ మూవీ యూత్ ను ఓ ఊపు ఊపేసింది. ఈ మూవీలోని హీరో సిద్ధు జొన్నలగడ్డ వన్ లైనర్ డైలాగ్స్ ఇప్పటికీ మీమ్స్ లో పేలుతుంటాయి. ఇక ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కూడా మంచి కలెక్షన్స్ రాబట్టింది. ఈ మూవీ తర్వాత గ్యాప్ తీసుకుని దర్శకుడు విమల్ కృష్ణ ఇప్పుడు మరో క్రేజీ కాన్సెప్ట్ తో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధం అయ్యాడు. అనుమాన పక్షి అనే వినూత్నమైన సినిమాతో వస్తున్నాడు.
ఇందుకు సంబంధించిన ట్రైలర్ తాజాగా విడుదలైంది. టాలెంటెడ్ యంగ్ హీరో రాగ్ మయూర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా ట్రైలర్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది. అనుమానపు క్యారెక్టర్ లో రాగ్ మయూర్ రచ్చ రచ్చ చేశాడు. నిజజీవితంలో ప్రతి మనిషిలోనూ ఎదుటి మనిషిపై అనుమానం అనేది సహజంగా ఉంటుంది. మరి ఈ అనుమానం అధికంగా ఉన్న వ్యక్తి స్క్రీన్ పై చేసే విన్యాసాలే ఈ మూవీ కథాంశం అని ట్రైలర్ చూస్తుంటే అర్థం అవుతోంది. ప్రతి చిన్న విషయానికి అనుమానపడే వ్యక్తిగా రాగ్ మయూర్ నటన, హావభావాలు థియేటర్ లో నవ్వులు పూయించడం గ్యారంటీ అనిపిస్తోంది. డీజే టిల్లు మూవీ మాదిరిగానే అనుమాన పక్షి సినిమాలోనూ కేవలం కామెడీ మాత్రమే కాకుండా.. క్రైమ్ థ్రిల్లర్, డార్క్ కామెడీ అంశాలను కూడా దర్శకుడు జోడించినట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. మొత్తానికి మరోసారి థియేటర్లలో నవ్వులు పూయించేందుకు దర్శకుడు విమల్ కృష్ణ సిద్ధం అయినట్లు తెలుస్తోంది.

ఇక ఈ మూవీలో రాగ్ మయూర్ తో పాటు ప్రిన్స్ సెసిల్, బ్రహ్మాజీ, అజయ్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే చిలకా ప్రొడక్షన్స్ సమర్పణలో రాజీవ్ నిర్మిస్తున్న ఈ సినిమాకు శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 18 న థియేటర్లలో విడుదల కానుంది. మరి డీజే టిల్లు రేంజ్ లో ఈ మూవీ ఆకట్టుకుంటుందో లేదో చూడాలి.












Click it and Unblock the Notifications
