స్టార్ హీరో కొడుకుతో అనుపమ పరమేశ్వరన్‌ ఎఫైర్ ? పబ్లిక్‌గా లిప్ లాక్‌

హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్‌కు తెలుగులో మంచి క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా యూత్‌లో అనుపమ ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది. తన అందం, నటన, క్యూట్ ఎక్స్ ప్రెషన్స్‌తో కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తోంది ఈ కేరళ కుట్టి. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన "అ..ఆ" సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయిన అనుపమ పరమేశ్వరన్‌.. ఆ తరువాత యూత్‌ ఫుల్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

రామ్, నాగ చైతన్య, నిఖిల్, నాని, సాయి ధరమ్ తేజ్, సిద్ధు జొన్నలగడ్డ వంటి యంగ్ స్టార్స్‌తో ఈ అమ్మడు నటించింది. ప్రస్తుతం అనుపమ చేతిలో నాలుగైదు సినిమాలకు పైగానే ఉన్నాయంటే ఆమె డిమాండ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. టిల్లు స్క్వేర్‌తో అనుపమ పరమేశ్వరన్ ఒక్కసారిగా టాక్ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా మారిపోయింది. డీజె టిల్లు సీక్వెల్‌గా వచ్చిన స్క్వేర్‌లో హీరోయిన్‌గా నటించిన అనుపమ పరమేశ్వరన్ ఒక్కసారిగా సోషల్ మీడియాలో స్టార్‌గా మారిపోయింది. సిద్దు జొన్నలగడ్డతో రెచ్చిపోయి రొమాన్స్ చేయడంతో అనుపమ పరమేశ్వరన్ ఒక్కసారిగా ట్రెండింగ్‌లో వచ్చింది. గతంలో ఎన్నడు లేనంత హాట్ కనిపించి అభిమానులకు షాకిచ్చింది.

Anupama Parameswaran and Dhruv Vikram spark dating rumours

టిల్లు స్క్వేర్‌‌లో ఓ రేంజ్‌లో అందాలు ఆరబోసింది. సిద్దు జొన్నలగడ్డతో లిప్ లాక్‌‌లతో అమ్మడు రెచ్చిపోయింది. దీంతో ఎక్కడ చూసినా కూడా అనుపమ రొమాన్స్ గురించే విపరీతమైన చర్చ సాగుతోంది. తెలుగు, తమిళం, మలయాళంలో వరుస సినిమాల్లో నటిస్తూ స్టార్ హీరోయిన్‌గా మారింది. ఇక సోషల్ మీడియాలో కూడా అమ్మడు ఫాలోయింగ్ చూస్తే మతిపోతోంది. అనుపమ అంటే యూత్ పడిచచ్చి పోతారంతే. మిలియన్ల సంఖ్యలో అమ్మడను ఫాలో అవుతున్నారంటే అనుపమ రేంజ్‌ ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే అనుపమ పరమేశ్వరన్‌కు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త నెట్టింట వైరల్‌గా మారింది.తమిళ స్టార్ హీరో విక్రమ్ కొడుకు ధృవ్‌తో అనుపమ పరమేశ్వరన్‌ డేటింగ్ చేస్తుందంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది.

వీరిద్దరూ 'బైసన్' (Bison) సినిమాలో అనే నటిస్తున్నారు. షూటింగ్ సమయంలో ఏర్పడిన పరిచయం ప్రేమగ మారిందని తెలస్తోంది. తాజాగా వీరిద్దరు లిప్ లాక్ పెట్టుకున్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో వీరిద్దరు రిలేషన్‌లో ఉన్నారని అంతా ఫిక్స్ అయిపోయారు. అయితే ఈ ప్రచారంపై వీరిద్దరు ఇప్పటి వరకు స్పందించలేదు.ప్రస్తుతం అనుపమ, ధృవ్ లిప్ లాక్ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+