సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న అనుపమ పరమేశ్వరన్ ...వరుడు ఎవరంటే..?
హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్‌కు తెలుగులో మంచి క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా యూత్‌లో అనుపమ ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది. తన అందం, నటన, క్యూట్ ఎక్స్ ప్రెషన్స్‌తో కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తోంది ఈ కేరళ కుట్టి. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అ..ఆ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచియం అయిన అనుపమ పరమేశ్వరన్.. ఆ తరువాత యూత్‌ఫుల్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

రామ్, నాగ చైతన్య, నిఖిల్, నాని వంటి యంగ్ స్టార్స్‌తో ఈ అమ్మడు నటించింది. ప్రస్తుతం నాలుగైదు సినిమాలకుపైగానే అనుపమ చేతిలో ఉన్నాయంటే ఆమె డిమాండ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. రవితేజతో ఈగల్, జోన్నలగడ్డ సిద్దుతో టిల్లు స్కైర్ వంటి సినిమాలు రిలీజ్‌కు సిద్దంగా ఉన్నాయి. ఇదిలా ఉంటే అనుపమకు సంబంధించిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
పెళ్లి కూతురు గెటప్‌లో ఉన్న ఫొటోను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫొటోలో తాళి బొట్టును హైలేట్ చేస్తూ ఫొటోలకు ఫోజిలిచ్చింది. దీంతో అందరు ఒక్కసారిగా షాక్‌కు గురైయ్యారు. అనుపమ సీక్రెట్‌గా పెళ్లి చేసుకుందా ఏంటీ అంటూ నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అయితే ఇది ఓ సినిమాలో గెటప్ అంటూ అనుపమ క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం అనుపమ జయం రవి హీరోగా నటిస్తోన్న సైరన్ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఆ సినిమాలోని సాంగ్ మేకింగ్ స్టిల్స్‌నే ఈ హాట్ బ్యూటీ షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.












Click it and Unblock the Notifications