మూడేళ్ల సీక్రెట్ లవ్.. సడెన్ గా బ్రేకప్ చెప్పిన అనుపమ.. ఎమోషనల్ పోస్ట్ వైరల్

మలయాళీ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ అనగానే 2015 లో వచ్చిన 'ప్రేమమ్' సినిమానే గుర్తుకువస్తుంది. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టింది అనుపమ. ఆ తర్వాత తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి పలు హిట్ సినిమాల్లో నటించింది. అఆ, శతమానంభవతి, ఉన్నది ఒక్కటే జిందగీ, కృష్ణార్జున యుద్ధం, హలో గురూ ప్రేమ కోసమే, రాక్షసుడు, అంటే సుందరానికి, కార్తికేయ 2, ఈగల్, టిల్లు స్క్వేర్, పరదా, కిష్కింధ పురి లాంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్స్ సొంతం చేసుకుంది. గతేడాది విక్రమ్ కుమారుడు ధ్రువ్ విక్రమ్ తో బైసన్ అనే సినిమా చేసింది అనుపమ. ఈ చిత్రానికి పా. రంజిత్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ కమర్షియల్ గా హిట్ అయింది. లీడ్ పెయిర్స్ కు మంచి గుర్తింపు లభించింది.

అయితే అనుపమ, ధ్రువ్ విక్రమ్ బైసన్ సినిమాకు ముందు నుంచే ప్రేమలో ఉన్నట్లు కథనాలు వెల్లడయ్యాయి. దాదాపు మూడేళ్లపాటు వీరి సీక్రెట్ లవ్ నడిచినట్లు సమాచారం. అయితే రీసెంట్ గా ఈ యంగ్ హీరోకు అనుపమ బ్రేకప్ చెప్పినట్లు తెలుస్తోంది. కోలీవుడ్ లో ఇప్పుడు ఇది హాట్ టాపిక్ గా మారింది. తన బ్రేకప్ ను పరోక్షంగా ప్రకటిస్తూ.. ఇన్ స్టాగ్రామ్ లో అనుపమ పరమేశ్వరన్ పెట్టిన పోస్టులు కొన్ని ఇప్పుడు సంచలనంగా మారాయి. అలాగే ధ్రువ్ విక్రమ్ ను అన్ ఫాలో కొట్టినట్లు స్పష్టం అవుతోంది. త్వరలోనే పెళ్లి చేసుకోనున్నారంటూ వార్తలు వచ్చిన వేళ ఈ జంట సడెన్ గా విడిపోవడం చర్చనీయాంశంగా మారింది.

Anupama Parameswaran Malayali beauty Reports are circulating that has broken up with Dhruv Vikram

అయితే అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ చెప్పడానికి కారణం ధ్రువ్ విక్రమ్ అని తెలుస్తోంది. ఆమె పట్ల యంగ్ హీరో అసభ్యంగా ప్రవర్తించినట్లు సమాచారం. ఇటీవల చెన్నైలోని ఓ స్టార్ హోటల్ లో వీరి బ్రేకప్ వివాదం తీవ్ర స్థాయిలో జరిగింది. ఇరువురు గొడవ పడ్డారు. ధ్రువ్ విక్రమ్ ప్రవర్తనతో విసిగిపోయిన అనుపమ.. తీవ్ర కోపంతో అతడ్ని చెప్పుతో కొట్టిందని టాక్ వినిపిస్తోంది. అంతేకాక ధ్రువ్ విక్రమ్ ను తీవ్రంగా తిట్టిపోస్తూ ఆ హోటల్ నుంచి అనుపమ బయటకు వెళ్లిపోయిందట.

అతడ్ని ఇన్‌ స్టాగ్రామ్‌ లో అన్‌ ఫాలో చేయడమే కాకుండా.. ఇకపై ఎవరి అనుమతులూ అవసరం లేదు. ఎలాంటి భయాలూ లేవు అంటూ తన ఇన్‌స్టా లో పోస్ట్ పెట్టి కొత్త జీవితాన్ని మొదలుపెట్టిందని టాక్ నడుస్తోంది. ఏదేమైనా ఈ విషయంపై త్వరలోనే ఫుల్ క్లారిటీ రానుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+