ఆడిషన్స్‌కి పిలిచి అలాంటి అవమానం.. అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

హిట్, ఫ్లాప్స్‌తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ వస్తున్నారు అనుపమ పరమేశ్వరన్. ఇటీవల వ్యక్తిగత జీవితంలో ఎదురైన కష్టాన్ని ఎదుర్కొని తిరిగి సినిమాలలో బిజీ అవుతున్నారు అనుపమ. తాజాగా క్రేజీ కళ్యాణం మూవీతో తెలుగువారిని పలకరించారు. ఈ సినిమా ప్రమోషనల్ కార్యక్రమాల్లో భాగంగా ఓ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అనుపమ పరమేశ్వరన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ వివరాల్లోకి వెళితే..

మనసులో ఉన్నది ఉన్నట్లు మాట్లాడటంలో అనుపమ ముందుంటారు. ఈ విషయంలో ఎన్ని విమర్శలు వచ్చినా ఆమె వెనక్కి తగ్గరు. గతంలో వ్యక్తిగత వేధింపుల కారణంగా తాను ఎంతో కుంగిపోయా.. ఒక దశలో నట జీవితాన్నే వదిలిపెట్టాలని అనుకున్నాను. ప్రతిరోజు భారంగా జీవితాన్ని గడిపాను. రోజూ పోరాడాల్సి వస్తోంది.. రాత్రి పడుకునే ముందు ఈరోజుకు బతికిపోయాను స్వామి అనిపించేది. జీవితం ఓ సవాలుగా మారిపోయింది. నా అనుభవాలు కొందరిలో అయినా ధైర్యం తీసుకొస్తాయనే ఈ విషయాలు పంచుకుంటున్నానని అనుపమ తెలిపారు.

Anupama Parameswaran Recalls Her First Audition Rejection for Premam

ఇక సోషల్ మీడియాలో వచ్చే నెగిటివ్ కామెంట్స్‌పైనా అనుపమ పలుమార్లు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎంతో ఇష్టపడి చేసిన పరదా సినిమా గురించి కొందరు నెగిటివ్ కామెంట్స్ చేశారు.. ఈ ట్రోలింగ్ మా సినిమా భవిష్యత్తును నిర్ణయించలేవు. ఆ సినిమా ప్రేక్షకుల అభిమానాన్ని దక్కించుకోలేకపోయినా... నా నట ప్రస్థానంలో ఒక మంచి సినిమా చేశాననే తృప్తి జీవితాంతం మిగులుతుంది. తొలినాళ్లలో ఇలాంటి ట్రోలింగ్‌కు బాధపడేదానిని.. కానీ ఇప్పుడు అలాంటి వాటిని వదిలేశా. ఎవరెన్ని మాటలన్నా ముందుకు సాగాల్సిందేనని అనుపమ స్పష్టం చేశారు.

ఇక తన జీవితంలో ఓసారి ఓ సినిమా కోసం ఆడిషన్స్‌కి వెళ్లినప్పుడు నన్ను రిజెక్ట్ చేశారని అనుపమ గుర్తుచేసుకున్నారు. నా జీవితంలో ఫస్ట్ ఆడిషన్స్ అంటే ప్రేమమ్ కోసమే. అక్కడికి వెళ్లాక వాళ్లు నన్ను చూశారు.. ఆ టైంలో నా హెయిర్ స్టైల్ ఎలా పడితే అలా ఉండేది. హెయిర్ కట్ చేసుకుంటావా అని ఆడిషన్స్‌లో అడిగారు.. క్యారెక్టర్‌కి లుక్ బాగుందని నిర్ణయించుకున్నాక సీన్ పేపర్ ఇచ్చారు. అందులో ఓ బ్రేకప్ సీన్ లాంటిది ఉంది.. నాకు థియేటర్‌లో చేసిన ఎక్స్‌పీరియన్స్ మాత్రమే ఉంది. డైరెక్టర్ యాక్షన్ అని చెప్పగానే ఒక స్టెప్ ముందుకు వేసి సీన్ చేశాను. 10 సార్లు కట్ చెప్పినా అలాగే చేశా. దాంతో వాళ్లు నాకు దండం పెట్టేసి వెళ్లిపోమన్నారు అని అనుపమ తెలిపారు.

ఈ బాధతో ఇంటికి వెళ్లకుండా కాలేజీ హాస్టల్‌కి వెళ్లాను. నా జీవితంలో నాకు పెద్దగా రిజెక్ట్ అయిన సందర్భాలు లేవు.. అదే పెద్దది. 2 వారాల పాటు ఈ విషయం ఎవరికీ చెప్పకుండా నాలోనే అనుభవించా... ఫ్రెండ్స్‌కి చెబితే ఎగతాళి చేస్తారని భయం. ఆ టైంలో డైలాగ్స్‌ని పదే పదే రిహార్సల్ చేశా. అదృష్టవశాత్తూ రెండు వారాల తర్వాత వాళ్లు నాకు మళ్లీ కాల్ చేయడంతో ఆనందం పట్టలేకపోయా. కానీ మా అమ్మ మాత్రం నా కూతురిని అవమానిస్తారా? నా కూతురిని రిజెక్ట్ చేస్తారా? నేను పంపను అని మొండి పట్టు పట్టింది. దాంతో మా అమ్మని బతిమలాడి ప్రేమమ్‌ సెట్‌లో అడుగుపెట్టా. ఈసారి యాక్షన్ చెప్పినప్పుడు స్టెప్ వేయకుండా సీన్ కంప్లీట్ చేశాను అని అనుపమ పరమేశ్వరన్ గుర్తుచేసుకున్నారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+