ఓటీటీలోకి వచ్చేసిన అనుపమ పరమేశ్వరన్ కొత్త సినిమా

అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటించిన 'పరదా' చిత్రం ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి వచ్చేసింది. ఈ సినిమా ప్రస్తుతం తెలుగు, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. విభిన్న కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌గా నిలిచింది. దీంతో విడుదలైన రెండు వారాలకే ఈ సినిమా ఓటీటీలో ప్రత్యక్షమైంది.

కథ:
ఒక ఊరిలోని మహిళలు సంప్రదాయం ప్రకారం ముఖాలకు పరదాలు వేసుకుని జీవిస్తుంటారు. అలాంటి గ్రామం నుంచి సుబ్బలక్ష్మి అనే అమ్మాయి బయటి ప్రపంచంలోకి అడుగుపెడుతుంది. ఆమె ఎందుకు ఊరు వదిలి వెళ్లింది? అక్కడ ఆమె ఎలాంటి కష్టాలను ఎదుర్కొంది? చివరికి ఆమె తీసుకున్న నిర్ణయం ఏమిటి? అనేదే ఈ సినిమా కథ.

దర్శకుడు ప్రవీణ్ కందిరీగుల ఈ కథను చాలా సున్నితంగా, భావోద్వేగభరితంగా తెరకెక్కించారు. ఫస్టాఫ్ ఎమోషన్స్‌తో డీసెంట్‌గా సాగింది. సెకండాఫ్ కొన్ని చోట్ల నెమ్మదిగా అనిపించినప్పటికీ, కథలోని ముఖ్యమైన భావోద్వేగాలను దర్శకుడు బాగా హ్యాండిల్ చేశారు. సినిమాటోగ్రఫీ, గోపి సుందర్ సంగీతం సినిమాకు చాలా ప్లస్ అయ్యాయి. ముఖ్యంగా క్లైమాక్స్‌లో వచ్చే కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులకు కొంత అసంతృప్తి కలిగించినా, మొత్తం మీద సినిమా ఓకే అనిపిస్తుంది.

Anupama Parameswaran s Paradha Now Streaming on Amazon Prime After Box Office Flop

ఈ సినిమాకు హైలైట్ అనుపమ పరమేశ్వరన్ నటన. సుబ్బలక్ష్మి పాత్రలో ఆమె జీవించేశారని చెప్పాలి. ఆమె నటనలోని పరిణతి ప్రతి సన్నివేశంలోనూ కనిపించింది. రఘు మయూర్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+