ఆ హీరో సినిమా అసౌకర్యంగా అనిపించింది..ప్రమోషన్స్‌లో కూడా వదల్లేదు

హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్‌కు తెలుగులో మంచి క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా యూత్‌లో అనుపమ ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది. తన అందం, నటన, క్యూట్ ఎక్స్ ప్రెషన్స్‌తో కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తోంది ఈ కేరళ కుట్టి. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అ..ఆ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచియం అయిన అనుపమ పరమేశ్వరన్‌.. ఆ తరువాత యూత్‌ఫుల్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

రామ్, నాగ చైతన్య, నిఖిల్, నాని వంటి యంగ్ స్టార్స్‌తో ఈ అమ్మడు నటించింది. ప్రస్తుతం నాలుగైదు సినిమాలకుపైగానే అనుపమ చేతిలో ఉన్నాయంటే ఆమె డిమాండ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. తెలుగు, తమిళం, మలయాళంలో వరుస సినిమాల్లో నటిస్తూ స్టార్ హీరోయిన్‌గా మారింది. ఇక సోషల్ మీడియాలో కూడా అమ్మడు ఫాలోయింగ్ చూస్తే మతిపోతోంది. అనుపమ అంటే యూత్ పడిచచ్చి పోతారంతే. మిలియన్ల సంఖ్యలో అమ్మడను ఫాలో అవుతున్నారంటే అనుపమ రేంజ్‌ ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

Anupama Parameswaran s Struggle with Tillu Square Costumes

టిల్లు స్క్వేర్‌తో అనుపమ పరమేశ్వరన్ ఒక్కసారిగా టాక్ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా మారిపోయింది. డీజె టిల్లు సీక్వెల్‌గా వచ్చిన స్క్వేర్‌లో హీరోయిన్‌గా నటించిన అనుపమ పరమేశ్వరన్ ఒక్కసారిగా సోషల్ మీడియాలో స్టార్‌గా మారిపోయింది. సిద్దు జోన్నలగడ్డతో రెచ్చిపోయి రొమాన్స్ చేయడంతో అనుపమ పరమేశ్వరన్ ఒక్కసారిగా ట్రెండింగ్‌లో వచ్చింది. గతంలో ఎన్నడు లేనంత హాట్‌గా కనిపించి అభిమానులకు షాకిచ్చింది. టిల్లు స్క్వేర్‌‌లో ఓ రేంజ్‌లో అందాలు ఆరబోసింది. సిద్దు జోన్నలగడ్డతో లిప్ లాక్‌‌లతో అమ్మడు రెచ్చిపోయింది. ఆ సినిమా విడుదల ఎక్కడ చూసిన కూడా అనుపమ రొమాన్స్ గురించే విపరీతమైన చర్చ సాగింది.

తాజాగా ఈ సినిమాపై అనుపమ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారాయి. 'టిల్లూ స్క్వేర్' సినిమాలో లిల్లీ పాత్రలో కనిపించిన నటి అనుపమ పరమేశ్వరన్, ఆ పాత్రపై తన అనుభవాన్ని పంచుకున్నారు. సాధారణంగా గ్లామరస్ పాత్రలకు దూరంగా ఉండే అనుపమకు ఈ రోల్ చేయడం అంత సులభం కాలేదని తెలిపారు.లిల్లీ పాత్రను అంగీకరించడానికి తాను చాలా సమయం ఆలోచించానని అనుపమ వెల్లడించారు.

షూటింగ్, ప్రమోషన్స్ సమయంలో కూడా ఆ పాత్రకు సంబంధించిన డ్రెస్సులు తనకు సౌకర్యంగా అనిపించలేదని ఆమె చెప్పారు.ఈ పాత్రకు ప్రేక్షకుల నుంచి విమర్శలు వస్తాయని తాను ముందే ఊహించానని అనుపమ అన్నారు. సినిమా విడుదలయ్యాక అదే నిజమైందని, అయితే తర్వాత అందరూ తన నటనను, పాత్రను ప్రశంసించడంతో ఎంతో సంతోషం కలిగిందని ఆమె పేర్కొన్నారు.టిల్లూ స్క్వేర్' సినిమా తన కెరీర్‌లో ఒక ముఖ్యమైన మలుపు అని అనుపమ అన్నారు. ఈ సినిమా తనకు కొత్త అనుభవాన్ని ఇచ్చిందని, భవిష్యత్తులో ఇలాంటి విభిన్న పాత్రలు చేయడానికి ఇది ప్రేరణగా నిలిచిందని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+