బయడపట్ట అనుష్క ఎఫైర్..కెమెరామెన్‌తో అలా..?

హీరోయిన్ అనుష్క శెట్టి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అతి తక్కువ కాలంలోనే అనుష్క తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నారు. తెలుగులో స్టార్ హీరోలందరితోనూ నటించి ఫుల్ పాపులారిటీని సంపాదించుకుందామె. లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తూ స్పెషల్ క్రేజ్ తెచ్చుకుంది. ముఖ్యంగా అరుంధతి సినిమాతో అనుష్క రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. తెలుగులో హీరోలతో సమానంగా అనుష్కకు మార్కెట్ ఉందంటే అతిశేయోక్తి కాదు.

అయితే గత కొంతకాలంగా అనుష్క సినిమాలు చేయడం తగ్గించేసిందనే చెప్పాలి. జీరోసైజ్ సినిమాతో లావు పెరగిన అనుష్క తరువాత బరువు తగ్గడానికి చాలా ప్రయత్నాలు చేసింది. దాదాపు 100 కేజీలకు పైగా బరువు పెరిగి షాకిచ్చింది. ఆవెంటనే నిశ్శబ్దం సినిమా కోసం బరువు తగ్గి మాములు స్థితిలోకి వచ్చింది. గతేడాది యంగ్ హీరో నవీన్ పోలిశెట్టితో కలిసి మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో అనుష్క ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Anushka is rumored to be in a relationship with a cameraman

ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసింది. ఆ తరువాత మరే సినిమాను అనుష్క అంగీకరించలేదు. కథ నచ్చితే తప్పిస్తే అనుష్క సినిమా ఒప్పుకోదనే విషయం తెలిసిందే.అయితే తాజాగా అనుష్క తన కొత్త సినిమాపై అఫిషియల్‌గా ఎనౌన్స్‌మెంట్ చేసింది. 'కథానర్' అనే సినిమాలో నటించడానికి అనుష్క గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.ఈ సినిమాతో అనుష్క మలయాళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. ఇదిలా ఉంటే తాజాగా అనుష్కకు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది.

అనుష్క పెళ్లి , రిలేషన్ గురించి అనేక కథనాలు వెలువడిన సంగతి తెలిసిందే. ప్రభాస్‌తో అనుష్క ప్రేమలో ఉందని, త్వరలో వీరిద్దరు పెళ్లి అంటూ పుకార్లు షికార్లు చేశాయి. అయితే తామిద్దరం కేవలం స్నేహితులమే అంటూ అనుష్క,ప్రభాస్ క్లారిటీ ఇచ్చారు. హీరో గోపీచంద్‌తో కూడా అనుష్క లవ్ ట్రాక్ నడిపారనే వార్తలు వైరల్ అయ్యాయి. వీరిద్దరి కాంబోలో వచ్చిన 'లక్ష్యం', 'శౌర్యం' సినిమాల్లో వీరు కలిసి నటించి హిట్స్ కొట్టిన సంగతి తెలిసిందే.

దీంతో వీరిద్దరూ లవ్‌లో ఉన్నారనే రూమర్స్ వచ్చాయి. అయితే ఈ పుకార్లకు వీరిద్దరూ స్పందించలేదు. తాజాగా ఓ కెమెరా‌మెన్‌ను అనుష్క ఇష్టపడిందనే రూమర్ వైరల్ అవుతోంది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కె కె సెంథిల్ కుమార్, అనుష్క శెట్టి కూడా ప్రేమలో ఉన్నారనే వార్తలొచ్చాయి. సెంథిల్ పెద్దవాళ్లతో మాట్లాడి అనుష్కను పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారట. అయితే ఏం జరిగిందో తెలియదు కానీ సెంథిల్ రూహి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. దీంతో ఇది కేవలం పుకారే అంటూ స్వీటీ అభిమానులు కొట్టిపారేస్తున్నారు. మరి రూమర్లపై అనుష్క ఎలా స్పందిస్తుందో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+