అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !!
సౌత్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి.. తనదైన శైలితో రెండు దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తోంది. కన్నడలో జన్మించిన ఈ భామ.. 2005లో నాగార్జున హీరోగా వచ్చిన సూపర్ చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఆ తరువాత విక్రమార్కుడు, లక్ష్యం, శౌర్యం, చింతకాయల రవి, కింగ్, బిల్లా, ఖలేజా, రగడ, ఢమరుకం, మిర్చి, సైజ్ జీరో, ఊపిరి, భాగమతి వంటి హిట్స్‌తో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించింది. ముఖ్యంగా అరుంధతితో లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారగా.. బాహుబలి సిరీస్‌తో పాన్-ఇండియా స్థాయిలో గుర్తింపు పొందింది.
ఇటీవల మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి, ఘాటీ చిత్రాల్లో నటించారు. నవీన్ హీరోగా వచ్చిన మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి మూవీతో అనుష్క మరో హిట్ తన ఖాతాలో వేసుకోగా.. భారీ అంచనాల మధ్య వచ్చిన ఘాటి పరాజయాన్ని మూట గట్టుకుంది. ప్రస్తుతం ఈ భామ నటిస్తున్న మరో చిత్రం "కథనార్- ది వైల్డ్ సోర్సెరర్". రోజిన్ థామస్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో జయసూర్య హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమాతో అనుష్క మలయాళ ఇండస్ట్రీకి అడుగుపెట్టనున్నారు. ఇప్పుడు లేటెస్ట్ గా ఈ చిత్రం ట్రైలర్ రిలీజ్ చేశారు.

ట్రైలర్ చూస్తుంటే.. రొటీన్ చిత్రాలకు భిన్నంగా కొత్త ఫాంటసీ ప్రపంచంలోకి తీసుకెళ్లేలా అనిపిస్తుంది. వీడియో ప్రారంభం నుంచే డార్క్, రిచ్ విజువల్స్‌తో డిజైన్ చేశారు. మరి ముఖ్యంగా సీజీఐ వర్క్ చాలా బాగుంది. అలానే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా ఉత్కంఠను రెట్టింపు చేసేలా అదరగొట్టారు. దీంతో ఫుల్ ట్రెండింగ్ గా మారింది.












Click it and Unblock the Notifications