రెండో సారి తల్లి కాబోతున్నఅనుష్కశర్మ...ఇది నిజమేనా..!
బాలీవుడ్‌లో ఎన్నో మంచి సినిమాల్లో నటించి గొప్పనటిగా పేరు సంపాదించుకున్న అనుష్క శర్మ. ఈ మధ్యకాలంలో సినిమాలకు కాస్త దూరంగానే ఉన్నారు. అయితే, ఆమె ఎక్కువగా కూతురు వామికకే సమయం కేటాయిస్తున్నట్లు తెలుస్తోంది. కోహ్లీ, అనుష్కశర్మ తమ గారాల పట్టి వామికను మాత్రం మీడియాకు దూరంగా ఉంచుతున్నారు. మరికొన్ని రోజుల్లో వన్డే ప్రపంచకప్ జరగబోతోంది. ఈ మెగా పోటీల్లో భారత్ తరఫున అత్యుత్తమ ప్రదర్శన చేసేందుకు.. దేశాన్ని ఛాంపియన్ గా నిలిపేందుకు ప్లేయర్ విరాట్ కోహ్లీ సిద్ధమవుతున్నాడు. ఈ సమయంలోనే విరాట్, అనుష్క ఇంటి నుంచి ఓ గుడ్‌న్యూస్ బయటకు వచ్చింది. విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. అయితే దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక సమాచారం వెల్లడి కాలేదు. కోహ్లి కానీ, అనుష్క కానీ ఈ విషయంపై అధికారికంగా ఇంత వరకూ ఎలాంటి ప్రకటన చేయలేదు. కాబట్టి ఇందులో వాస్తవమెంతో తెలీదు.
రెండోసారి తల్లి కాబోతున్న నటి : హిందుస్తాన్ టైమ్స్ ప్రకారం.. అనుష్క రెండోసారి తల్లి కాబోతోంది. విరాట్ కోహ్లి మరోసారి తండ్రి కాబోతున్నాడు. వీరిద్దరూ 2017 లో పెళ్లి చేసుకున్నారు. వారిద్దరూ రిలేషన్ లో ఉన్న విషయంలో సోషల్ మీడియాలో చాలా పుకార్లే వచ్చాయి. ఆ తర్వాత వారు పెళ్లి చేసుకున్నారు. పెళ్లి అయిన 4 సంవత్సరాల తర్వాత విరుష్క జంట కుమార్తెకు జన్మనిచ్చింది. ఇప్పుడు రెండో బిడ్డకు జన్మనివ్వడానికి సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. అయితే గతసారి మాదిరిగానే ఈసారి కూడా ఈ గుడ్ న్యూస్ ను కాస్తంత ఆలస్యంగా ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు మీడియా వర్గాల్లో వినిపిస్తోంది. విరాట్ కోహ్లి - అనుష్క జంట 2021 జనవరిలో తన మొదటి బిడ్డకు జన్మనిచ్చింది. మొదటి సంతానం ఆడపిల్ల. కోహ్లి- అనుష్క తమ కుమార్తెకు విరాట్ కోహ్లి, అనుష్క శర్మ పేర్లు కలిసేలా వామిక అనే పేరు పెట్టారు.

గోప్యంగా కూతురి ఫోటోలు : వామికను ఇప్పటి వరకు ప్రజలకు, మీడియాకు దూరంగానే ఉంచింది ఈ జంట. వామిక ముఖాన్ని చూపే ఫోటోలు ఇప్పటి వరకు ఎక్కడా కనిపించలేదు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ.. తమ కుమార్తెకు సంబంధించి ఏ ఫోటోను పోస్టు చేయలేదు. తమ కుమార్తె విషయంలో కోహ్లీ- అనుష్క చాలా గోప్యంగా ఉంచుతున్నారు. తమ బిడ్డకు అర్థం చేసుకునే పరిజ్ఞానం వచ్చి, తనే సొంతంగా ఎంపిక చేసుకునే వరకు సోషల్ మీడియాకు దూరంగా ఉంచాలని నిర్ణయించుకున్నట్లు విరాట్ కోహ్లీ- అనుష్క గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే.
అయితే, మీడియా కథనాల ప్రకారం.. కొన్ని రోజుల ముందు అనుష్కశర్మ, కోహ్లీ ఒక మెటర్నిటి క్లీనిక్ దగ్గర మీడియా ఫోటోగ్రాఫర్లకు కనిపించినట్లు తెలుస్తోంది. అయితే, త్వరలోనే ఈ విషయంపై సోషల్‌మీడియాలో ప్రకటిస్తాం. అంతవరకూ ఈ ఫోటోలు లీక్ చేయొద్దంటూ మీడియా వారిని ఈ జంట రిక్వెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. చాలా రోజుల నుండి అనుష్కశర్మ కూడా మీడియాకు దూరంగా ఉన్నారు. ఏది ఏమైనా త్వరలోనే ఈ జంట గుడ్‌న్యూస్ చెప్పబోతున్నారనే వార్తలయితే వినిపిస్తున్నాయి.
-
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్‌గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు?












Click it and Unblock the Notifications