భారత్- పాక్ మ్యాచ్‌లో బేబీ బంప్‌తో ప్రత్యక్షమయిన అనుష్కశర్మ...
బాలీవు్డ్ నటి అనుష్క శర్మ మళ్లీ తల్లికాబోతుందనే వార్త గత కొన్ని రోజులుగా బీ టౌన్ వర్గాల్లో వినిపిస్తూనే ఉంది. అయితే, తాజాగా జరిగిన భారత్ - పాక్ మ్యాచ్‌లో ఈ విషయం బట్టబయలైంది. ఈ మ్యాచ్‌కు హాజరయిన అనుష్కశర్మ బేబీ బంప్‌తో కనిపించారు. ఇటీవల ICC పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ 2023 భారత్-పాకిస్థాన్ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌ను ఆస్వాదిస్తున్న అనుష్కశర్మ విజువల్స్ కొన్ని ప్రత్యక్ష ప్రసారం కాగా, కొన్ని ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్నాయి.
ఎక్స్‌లో పోస్ట్ చేసిన వీడియో: అయితే, మ్యాచ్ ముగిసిన తర్వాత హోటల్‌లో తీసిన వీడియోలో అనుష్కశర్మ బేబీ బంప్‌తో కనిపిస్తారు. అవును ఈ వార్త నిజమే! ఈ వీడియోను ఒక నెటిజన్ ఎక్స్‌లో పోస్ట్ చేసారు. అనుష్క శర్మ భారీ తెల్లటి దుస్తులలో కొంతమంది వ్యక్తులతో మాట్లాడటం ఈ వీడియోలో మనం చూడొచ్చు. అయితే ఇందులో విరాట్ అనుష్కశర్మ చేయిపట్టుకుని తీసుకువెళ్లడం కూడా కనిపిస్తుంది.

Virat Kohli and Anushka Sharma at Team Hotel, Ahmedabad❤️#viratkohli #anushkasharma pic.twitter.com/Xaqc7sXuIc
— 𝙒𝙧𝙤𝙜𝙣🥂 (@wrogn_edits) October 14, 2023
అయితే విరుష్క దంపతులు మాత్రం ఇప్పటివరకూ ఈ విషయం పై అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇటీవల ముంబైలోని ఓ మెటర్నటి క్లినిక్ బయట అనుష్క, విరాట్ కనిపించినప్పటి నుండి ఈ విషయంపై నిరంతరం చర్చ జరుగుతూనే ఉంది. అయితే కొన్ని రిపోర్టుల ప్రకారం.. వారిద్దరూ తమ ఫోటోలను తీయొద్దంటూ రిక్వెస్ట్ చేశారని, తమ రెండవ బిడ్డ గురించి త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తామని చెప్పినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా త్వరలోనే విరుష్క దంపతులు శుభవార్తను అభిమానులతో పంచుకోనున్నారు.












Click it and Unblock the Notifications