అతను ప్రపోజ్ చేస్తే..నేను ఓకే చెప్పా - అనుష్క గుడ్ న్యూస్ !!

సౌత్ ఇండియా లేడీ సూపర్ స్టార్ అనుష్క శెట్టి.. తనదైన శైలితో రెండు దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తోంది. 2005లో నాగార్జున హీరోగా వచ్చిన సూపర్ చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది ఈ కన్నడ బ్యూటీ. ఆ తరువాత విక్రమార్కుడు, లక్ష్యం, శౌర్యం, చింతకాయల రవి, కింగ్, బిల్లా, ఖలేజా, రగడ, ఢమరుకం, మిర్చి, సైజ్ జీరో, ఊపిరి, భాగమతి వంటి హిట్స్‌తో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించింది. ముఖ్యంగా అరుంధతితో లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారగా.. బాహుబలి సిరీస్‌తో పాన్-ఇండియా స్థాయిలో గుర్తింపు పొందింది.

ఇటీవల మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి, ఘాటీ చిత్రాల్లో నటించారు. నవీన్ హీరోగా వచ్చిన మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి మూవీతో అనుష్క మరో హిట్ తన ఖాతాలో వేసుకోగా.. భారీ అంచనాల మధ్య వచ్చిన ఘాటి పరాజయాన్ని మూట గట్టుకుంది. ప్రస్తుతం ఈ భామ నటిస్తున్న మరో చిత్రం "కథనార్‌- ది వైల్డ్‌ సోర్సెరర్‌". రోజిన్‌ థామస్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో జయసూర్య హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమాతో అనుష్క మలయాళ ఇండస్ట్రీకి అడుగుపెట్టనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇంకా కొన్ని సినిమాల కథలు చర్చల దశలో ఉన్నాయని తెలుస్తుంది.

Anushka Shetty opens about her first love and favourite heroins also king Nagarjuna goes viral on media

అయితే అనుష్క పర్సనల్ లైఫ్ గురించి గత కొన్నేళ్లుగా రకరకాల రూమర్లు వస్తూనే ఉంటున్నాయి. కానీ తనపై వస్తున్న వార్తల పట్ల ఇంత వరకు ఎప్పుడూ స్పందించలేదు. అయితే కొద్దికాలంగా మీడియాకు, ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న స్వీటి త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని సోషల్ మీడియా కోడై కూస్తుంది. ఈ క్రమంలోనే గతంలో ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. అందులో తన ఫస్ట్ లవ్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది అనుష్క.

అనుష్క ఏమన్నారంటే..

తన వ్యక్తిగత జీవితం, సహచర నటీనటుల గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తన ఫేవరెట్ హీరోయిన్స్‌ లిస్టులో త్రిష, నయనతార ఉన్నారని తెలిపారు. అలానే నాగార్జున అత్యంత పాజిటివ్ వ్యక్తి అని చెప్పారు. ఇక తన బలహీనత గురించి చెబుతూ.. ఫోన్‌ను సైలెంట్‌లో పెట్టడం తనపై వచ్చే పెద్ద ఫిర్యాదు అని ఓపెన్ అయ్యారు. తన ఫస్ట్ ప్రపోజల్ గురించి అడగ్గా.. అది పాఠశాలలో ఆరో తరగతిలో ఉండగా జరిగిందన్నారు. ఒక అబ్బాయి నువ్వంటే నాకు చాలా ఇష్టం అని చెప్పగా.. తెలియక ఓకే అని బదులిచ్చానని అనుష్క నవ్వుతూ చెప్పుకొచ్చారు.

మరోవైపు అనుష్క తన సహచర నటుడు, పాన్ ఇండియా స్టార్‌ హీరోతో ప్రేమలో ఉన్నారని.. త్వరలోనే పెళ్లి కూడా చేసుకుంటారని కూడా వార్తలు వచ్చాయి. ఆ విషయంపై సదరు హీరోగానీ.. అనుష్క ఎప్పుడూ మాట్లాడలేదు. కానీ ఆ హీరో ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉండడం.. పెళ్లి గురించి పెద్దగా పట్టించుకోకపోవడం పట్ల ఆమె కుటుంబ సభ్యులు మండిపడుతున్నారని సినీ వర్గాలలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక ఫ్యామిలీ ఒత్తిడి కారణంగా ఈ ఏడాదిలో అనుష్క పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్టు చర్చ జరుగుతోంది. తన ఫ్యామిలీలోనే దగ్గర రిలేషన్ వ్యక్తితో పెళ్లి జరగనుందని అనుకుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+