మన సినిమాకు సమోసా ఖర్చులు కూడా రావడం లేదు..!

ఎన్నో అంచనాల మధ్య సెప్టెంబర్ 5న విడుదలైన అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడిల చిత్రం 'ఘాటి' బాక్స్ ఆఫీస్ వద్ద చతికిలపడింది. 'బాహుబలి' తర్వాత అభిమానులు స్వీటీ కోసం ఆత్రుతగా ఎదురుచూడగా, భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా తొలిరోజు కలెక్షన్లు ట్రేడ్ వర్గాలను షాక్‌కు గురిచేశాయి.సుమారు రూ.50 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన 'ఘాటి' సినిమా ప్రపంచవ్యాప్తంగా తొలిరోజు కేవలం రూ.4 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఇందులో భారతదేశంలో నెట్ కలెక్షన్లు రూ.2.5 కోట్లు మాత్రమే కావడం గమనార్హం. ప్రీ-రిలీజ్ బిజినెస్ రూ.52 కోట్ల వరకు జరిగి, బ్రేక్ ఈవెన్ కోసం రూ.55 కోట్ల షేర్ అవసరమని అంచనా వేసిన డిస్ట్రిబ్యూటర్లకు ఈ ఫలితం తీవ్ర నిరాశను కలిగించింది.

అనుష్క చాలా కాలం తర్వాత వెండితెరపై కనిపించడంతో ఆమె అభిమానుల్లో 'ఘాటి' సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ, మొదటి షో తర్వాత వచ్చిన మిక్స్‌డ్ టాక్ సినిమా భవిష్యత్తుపై ప్రభావం చూపింది. కేవలం మొదటి రోజు 31 వేల టికెట్ సేల్స్‌తో మొదలైన ఈ సినిమా, రెండో రోజుకి వచ్చేసరికి మరింత డ్రాప్ అయి 27 వేల లోపే టికెట్ సేల్స్ నమోదు చేసింది.

Anushka Shetty s Ghaati Fails to Impress A Box Office Disappointment

'ఘాటి' సినిమా కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా నిరాశపరిచింది. ఓవర్సీస్‌లో కేవలం 16 వేల డాలర్స్ మార్క్‌ని మాత్రమే చేరుకోగలిగింది. ప్రపంచవ్యాప్తంగా రెండో రోజు కలెక్షన్లు ఒక కోటి లోపే షేర్ సాధించాయని అంచనా. చాలా థియేటర్లలో నెగటివ్ షేర్స్, డెఫిసిట్ లాంటివి ఎదుర్కొంది. దీనితో సినిమా భారీ నష్టాలను చవిచూసే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఈ పరిణామం అనుష్క అభిమానులకు, అలాగే తెలుగు సినిమా పరిశ్రమకు ఒక గుణపాఠం. స్టార్ నటీనటులు ఉన్నప్పటికీ, ప్రేక్షకుల అంచనాలను అందుకోకపోతే సినిమా ఎంతటి ప్రభావం చూపిస్తుందో 'ఘాటి' నిరూపించింది. సినిమా కంటెంట్, కథనం ప్రేక్షకులకు నచ్చకపోతే, బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడం ఎంత కష్టమో ఇది స్పష్టం చేసింది. ఈ సినిమా అనుష్క కంబ్యాక్‌కి ఊహించినంత బలాన్ని ఇవ్వలేకపోయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+