ఈ చిరంజీవి రికార్డులను బద్దలు కొట్టడం ఎవరివల్లా కాదు!
మెగాస్టార్ చిరంజీవిగా మనకు పరిచయం అయినపేరు మాత్రం మొదట్లో కొణిదెల శివశంకర్ వరప్రసాద్ గా ఉండేది. ప్రస్తుతం భారతదేశ సినీ చరిత్రలో తనకంటూ ఓ అధ్యాయాన్ని లిఖించుకున్నారు. స్వయంకృష్టితో మెగాస్టార్ గా ఎదిగారు. 69 సంవత్సరాల వయసులోను యువ హీరోలతో పోటీపడుతూ భారీ బడ్జెట్ సినిమాలు చేస్తున్నారు. తన మార్కెట్ ను చెక్కు చెదరకుండా చూసుకుంటున్నారు. తన నాలుగు దశాబ్దాల సుదీర్ఘ కెరీర్ లో ఆయన ఎన్నో రికార్డులను నెలకొల్పారు. కొన్ని రికార్డులను బద్దలు కొట్టడం ఏ హీరోవల్లా కాదు. వాటి వివరాలను తెలుసుకుందాం.
బావగారు బాగున్నారా సినిమా కోసం 240 అడుగుల ఎత్తు నుంచి ఎటువంటి డూప్ లేకుండా బంగీ జంప్ చేశారు.పసివాడి ప్రాణం సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు తొలిసారి బ్రేక్ డ్యాన్స్ ను పరిచయం చేశారు.
1980, 1983 సంవత్సరాల్లో చిరంజీవి నటించి సినిమాలు ఏడాదికి 14 చొప్పున విడుదలయ్యాయి.

పారితోషికంగా తొలిసారి కోటిరూపాయలు అందుకున్న ఏకైక భారతీయ హీరోగా రికార్డులకెక్కారు. 1992లో ఈ సంఘటన జరిగింది.చిరంజీవి నటించిన ఘరానా మొగుడు సినిమా తొలిసారి రూ.10 కోట్ల గ్రాస్ సాధించిన తొలి తెలుగు సినిమాగా ఘనత వహించింది.చిరంజీవి నటించిన ఇంద్ర సినిమా కూడా తొలిసారి రూ.30 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించిన తొలి తెలుగు చిత్రంగా నిలిచింది.
చిరంజీవికి వ్యక్తిగతంగా వెబ్ సైట్ ఉంది. ఆయన్ను గురించి తెలుసుకోవాలంటే https://www.kchiranjeevi.com/ సైట్ లో లాగిన్ అయితే చాలు.
దక్షిణ భారతదేశం నుంచి ఆస్కార్ వేడుకకు ఆహ్వానం అందుకున్న తొలి హీరోగా చిరంజీవి నిలిచారు. 1987లో ఆయనకు ఈ ఆహ్వానం అందింది.కె.విశ్వనాథ్ దర్శకత్వంలో నటించిన స్వయంకృషి సినిమా రష్యన్ భాషలోకి డబ్ అయిన తొలి తెలుగు చిత్రంగా రికార్డు సృష్టించింది.సినిమాల్లో ఏకపాత్రాభినయం, ద్విపాత్రాభినయం, త్రిపాత్రాభినయం.. ఇలా మూడూ చేసిన సినిమాలు శతదినోత్సవాలను జరుపుకున్నాయి. భారతదేశ సినీ చరిత్రలో ఇలాంటి రికార్డు ఒక్క చిరంజీవి పేరుపైనే ఉంది.
1999-2000 సంవత్సరంలో భారతదేశంలో అత్యధిక ఆదాయపు పన్ను చెల్లించిన వ్యక్తిగా నిలిచారు. ఇలా నిలిచినందుకు 2002లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి చేతులుమీదుగా సమ్మాన్ అనే అవార్డును అందుకున్నారు.












Click it and Unblock the Notifications