పవన్‌ కల్యాణ్ సినిమాలో నటించిన చంద్రబాబు

చంద్రబాబునాయుడు అంటే కాకలు తీరిన రాజకీయ యోధుడే కాదు.. వ్యూహాలు రచించి వాటిని విజయవంతంగా అమలు చేయడంలో దిట్ట. రాజకీయాలే శ్వాసగా జీవించే అరుదైన రాజకీయ నేత చంద్రబాబు. 1989 నుంచి చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో నిరాటంకంగా గెలుస్తూ వస్తున్నారు. 2024లో జరిగిన గెలుపుతో కలిపి వరుసగా ఎనిమిది సార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నాలుగుసార్లు ముఖ్యమంత్రి అయిన ఘనతను సాధించారు. ఉమ్మడి రాష్ట్రానికి రెండుసార్లు, విభజిత ఏపీకి రెండుసార్లు ముఖ్యమంత్రి అయ్యారు.

చంద్రబాబు విజన్‌పై గొప్ప నమ్మకం
సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన సన్నివేశాలను చాలామంది దర్శకులు తమ సినిమాల్లో ఉపయోగించుకున్నారు. ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా, పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణం, శాస్త్ర సాంకేతిక శాఖలకు మంత్రిగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఉన్నారు. చంద్రబాబు విజన్ పై పవన్ కు గొప్ప నమ్మకముంది. రాజకీయాల్లోకి రాకముందు పవన్ కల్యాణ్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో 'బద్రి' సినిమా చేశారు. ఈ సినిమాలో ముఖ్యమంత్రిగా కొంచెంసేపు చంద్రబాబు కనిపిస్తారు.

ap cm Chandrababu acted in deputy cm Pawan Kalyan movie

ఒప్పుకున్నవాటిని పూర్తిచేయాలి
జనసేన పార్టీని స్థాపించిన తర్వాత 2014 ఎన్నికల్లో పోటీచేయకుండా టీడీపీ, బీజేపీకి మద్దతు పలికారు. 2019 ఎన్నికల్లో విడిగా పోటీచేశారు. 2024 ఎన్నికల్లో బీజేపీ, టీడీపీతో కలిసి ఎన్డీయే కూటమిగా ఏర్పడి పోటీచేసిన 21 స్థానాల్లోను జనసేన గెలిచేలా వ్యూహం రూపొందించి విజయవంతం చేశారు. రాజకీయాల్లో బిజీగా ఉంటున్నప్పటికీ ఒప్పుకున్న సినిమాలను పూర్తిచేయాలనే యోచనలో పవన్ ఉన్నారు.

నెలకు 10 రోజులు సినిమా షూటింగ్స్ కు కేటాయించేలా ప్రణాళిక రూపొందించుకుంటున్నారు. ఓవైపు మంత్రిగా పనిచేస్తూనే మరోవైపు సినిమాలు చేయనున్నట్లు జనసేన వర్గాలు చెబుతున్నాయి. ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ, హరిహర వీరమల్లు సినిమాలు పూర్తిచేసిన తర్వాత కొత్త సినిమాలేమైనా ఒప్పుకుంటారా? లేదా? అనేదానిపై ఇంకా స్పష్టత రాలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+