'కల్కి' సినిమాపై ఏపీ హైకోర్టు ఏం చేయబోతోంది?
అభిమానులు ముద్దుగా డార్లింగ్ అని పిలుచుకునే పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా కల్కి మరికొద్ది గంటల్లో విడుదల కాబోతోంది. ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో కూడా దీన్ని విడుదల చేయాలనే యోచనలో చిత్ర బృందం ఉంది. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిపోయిన డార్లింగ్ కల్కి చిత్రంతో అంతర్జాతీయ హీరో అవుతున్నాడని డార్లింగ్ అభిమానులు గట్టి నమ్మకంతో ఉన్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే లాంటి భారీ తారాగణం ఈ సినిమాలో నటించింది. రూ.600 కోట్ల బడ్జెట్ తో వైజయంతీ మూవీస్ పతాకంపై సి.అశ్వనీదత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.
ఏపీ హైకోర్టులో వ్యాజ్యం
ఏపీ, తెలంగాణ.. రెండు రాష్ట్రాల్లో టికెట్ ధరలు పెంచుకోవడానికి ప్రభుత్వాలు అనుమతి మంజూరు చేశాయి. ఏపీలో సింగిల్ స్క్రీన్ లో రూ.75, మల్టీప్లెక్స్ లో 125 రూపాయలు పెంచుకునేలా అనుమతివ్వడంతోపాటు అదనపు షోలు వేసుకోవడానికి కూడా పర్మిషన్ వచ్చింది. దీంతో నిర్మాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఏపీ హైకోర్టులో దీనిపై ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ప్రభుత్వం అటువంటి అనుమతివ్వడం సరికాదని, అంతంత ధరలు పెట్టి ప్రేక్షకులు సినిమాలు చూడాలంటే ఆర్థికంగా భరించలేని స్థాయిలో ఖర్చవుతుందని అందులో పేర్కొన్నారు.

తక్కువ బడ్జెట్ లో అపురూపమైన సినిమాలు తీశారు
భారీ బడ్జెట్ ఏమీ పెట్టకుండానే గతంలో ఎంతోమంది దర్శకులు అపురూపమైన చిత్రాలను తీశారని, అప్పుడు లేని పెరుగుదల ఇప్పుడు ఎందుకని ప్రశ్నించారు. ప్రభుత్వ అనుమతిని కొట్టేయాలని పేర్కొన్నారు. అయితే దీనిపై హైకోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందా? అనే ఉత్కంఠ నెలకొంది. వాస్తవానికి వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో సినిమా థియేటర్ల టికెట్ ధరలను చాలా తగ్గించారు. ధరలు పెంచుకోవడానికి ప్రత్యేక అనుమతివ్వాలంటూ పరిశ్రమకు చెందిన పెద్దలంతా కలిసివచ్చి అప్పటి ముఖ్యమంత్రి జగన్ ను కలిశారు.












Click it and Unblock the Notifications