మంత్రి రోజా కూతురును చూశారా? చిల్ అవుతోంది!!
ఒకప్పుడు ఆమె స్టార్ హీరోయిన్.. ఇటీవలే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ అయిన జబర్దస్త్ కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరించారు. ప్రస్తుతం ఆమె ఏపీ క్రీడా శాఖ మంత్రిగా ఉన్నారు. ఆమె ఎవరో కాదు.. ఆర్కే రోజా. సోషల్ మీడియాలో ఎంతో చురుగ్గా ఉండే రోజా ఎప్పటికప్పుడు తన కార్యక్రమాలకు సంబంధించిన ఫొటోలను షేర్ చేస్తుంటుంది. అయితే వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఫొటోలను మాత్రం షేర్ చేయడం చాలా అరుదు.
ఆమె భర్త, తమిళంలో ఒకప్పటి స్టార్ డైరెక్టర్ ఆర్కే సెల్వమణి. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలున్నారు. ఒకమ్మాయి, ఒకబ్బాయి. రోజా కుమార్తె అన్షుమాలిక సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటుంది. ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. ఎంతో అందంగా, ఎదుటివారిని ఆకర్షిస్తూ ఉండే అన్షుమాలిక తనకు తోచినంతలో ఎదుటివారికి సాయం చేస్తూనే ఉంటుంది. నెటిజన్లు అయితే రోజా వారసత్వాన్ని నిలబెడుతూ తెలుగు సినీ పరిశ్రమలో మంచి హీరోయిన్ గా రాణించే లక్షణాలున్నాయంటూ కామెంట్లు పెడుతుంటారు.

చదువు పూర్తయ్యే వరకూ సినిమాలకు, షూటింగ్ ల్లాంటివాటికి దూరంగానే ఉంచాలని రోజా, సెల్వమణి భావిస్తున్నారు. అయితే కొడుకు లోహిత్ ను మాత్రం హీరోను చేయాలనే కోరిక ఇద్దరికీ ఉంది. మంత్రి రోజా కూడా ఈ విషయాన్ని చాలాసార్లు బహిరంగంగానే వెల్లడించింది. ప్రస్తుతం అన్షుమాలిక ఇటీవల తన ఎన్నారై స్నేహితులతో కలిసి బాగా చిల్ అవుతోంది.
దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో నగరి నుంచి మరోసారి పోటీచేసేందుకు మంత్రి రోజా సమాయత్తమవుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగానే కాకుండా నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధి పనులే మరోసారి గెలిపిస్తాయనే నమ్మకంతో ఉన్నారు.












Click it and Unblock the Notifications