AR రెహమాన్‌కు గుడ్ బై చెప్పేసిన భార్య.. కలిసి ఉండలేనంటూ ప్రకటన
ఇటీవల కాలంలో విడాకులు తీసుకునే వారి సంఖ్య ఎక్కువుగానే ఉంది. అందులోనూ సెలబ్రిటీల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేకుండాపోయింది. ఏ రోజు ఏ సెలబ్రిటీ విడాకులు గురించి ప్రకటిస్తారో అనే విధాంగా పరిస్థితి మారిపోయింది. సినిమా షూటింగ్ సమయంలో ప్రేమించి పెళ్లి చేసుకోవడం..ఆ తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకోలేక , కలిసి ఉండలేక విడాకుల బాట పడుతున్నారు. చాలామంది సెలబ్రిటీల జీవితాలు ఇలాగే ఉన్నాయి.
భాషతో సంబంధం లేకుండా సెలబ్రిటీలు చాలామంది విడాకులు తీసుకుంటున్నారు. తెలుగులో నాగచైతన్య-సమంత, పవన్ కల్యాణ్ - రేణు దేశాయ్, డైరెక్టర్ క్రిష్, చిరంజీవి కూతురు శ్రీజ, నాగబాబు కూతురు నిహారిక ఇలా చాలామంది తెలుగు సెలబ్రిటీలు విడాకులు తీసుకున్నారు. తమిళంలో కమల్ హాసన్ , ధనుష్, వంటి వారితో పాటు, బాలీవుడ్‌లో హృతిక్ రోషన్, అమీర్ ఖాన్ వంటి సూపర్ స్టార్లు సైతం తమ వైవాహిక జీవితానికి గుడ్ బై చెప్పి ఒంటరి జీవితాన్ని గడుపుతున్నారు.

తాజాగా ఈ లిస్ట్‌లో స్టార్ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ కూడా చేరారు. ఏఆర్ రెహమాన్ భార్య సైరా బాను తన భర్త నుంచి విడిపోతున్నట్లు ప్రకటించారు.మంగళవారం రాత్రి, ఆమె ఏఆర్ రెహమాన్ నుండి విడిపోతున్నట్లు ధృవీకరిస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. తమ మధ్య సయోధ్య చేయలేని దూరం పెరిగిపోయిందని, అందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నానని సైరా బాను తన ప్రకటనలో చెప్పుకొచ్చారు. ఏఆర్ రెహమాన్‌కు ఆయన భార్య విడాకులు ఇవ్వడంపై సినీ వర్గాలు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాయి. అయితే వీరు విడాకులు తీసుకోవడానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు.
ఏఆర్ రెహమాన్ 1995లో సైరాను వివాహం చేసుకున్నారు. ఏ. ఆర్. రెహమాన్‌కి మొత్తం ముగ్గురు పిల్లలు. రెహమాన్ గారి పెద్ద కూతురు. ఆమె కూడా సంగీత రంగంలోకి అడుగు పెట్టింది.రెహమాన్ గారి రెండవ కూతురు. ఆమె కీబోర్డ్ వాయిస్తుంది.రెహమాన్ గారి కుమారుడు. ఆయన కూడా సంగీత రంగంలో చురుగ్గా ఉంటారు. 29ఏళ్ల పాటు సాగిన వారి వివాహ బంధం విడాకులతో ముగిసినట్టు అయింది.












Click it and Unblock the Notifications