కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న చిన్న సినిమా.. కంటెంట్ ఈజ్ కింగ్..!
టాలీవుడ్ ట్రెండ్ మారింది. ఇప్పుడు చిన్న సినిమాలు పెద్ద హిట్టు అవుతున్నాయి. వందల కోట్ల భారీ బడ్జెట్ సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతున్నాయి. కానీ ప్రేక్షకుల్ని అలరించడంలో మాత్రం విఫలం అవుతున్నాయి. ఇదే సమయంలో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయం సాధిస్తున్నాయి చిన్న సినిమాలు. గతేడాది తెలుగులో పెద్ద సినిమాలు నిరాశపరచగా చిన్న సినిమాలు మాత్రం ప్రేక్షకుల్ని విశేషంగా అలరించాయి. వాటిలో రాజు వెడ్స్ రాంబాయి, లిటిల్ హార్ట్స్, శంభాల లాంటి చిత్రాలు ఉన్నాయి. ఈ ఏడాది కూడా కపుల్ ఫ్రెండ్లీ లాంటి చిన్న సినిమా భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే.
అయితే తాజాగా యాక్షన్ కింగ్ అర్జున్ ప్రధానపాత్రలో తెరకెక్కిన చిత్రం బ్లాస్ట్ జోన్.. తమిళంలో బ్లాస్ట్ అనే పేరుతో విడుదలైంది. ఈ మూవీలో అర్జున్ సర్జా, అభిరామి, ప్రీతి ముకుందన్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ చిత్రానికి సుభాష్ కే. రాజ్ దర్శకత్వం వహించారు. అలాగే రవి బస్రూర్ సంగీతం అందించారు. బ్లాస్ట్ జోన్ చిత్రాన్ని ఏజీఎస్ ఎంటర్ టైన్ మెంట్ సంస్థ నిర్మించింది. మార్షల్ ఆర్ట్స్ లో ప్రావీణ్యం ఉన్న ఓ సామాన్య మధ్యతరగతి కుటుంబం చుట్టూ ఈ స్టోరీ తిరుగుతుంది. ఎలాంటి అంచనాలు లేకుండా సైలెంట్ గా రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. కేవలం మౌత్ టాక్ తోనే ఈ మూవీ దూసుకెళ్తోంది.

అర్జున్ బ్లాస్ట్ జోన్ మూవీ ఫస్ట్ వీకెండ్ లోనే రూ. 25 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. అలా ఈ సస్పెన్స్ డ్రామా రోజురోజుకూ కలెక్షన్స్ ను పెంచుకుంటూ ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు కనీసం ప్రమోషన్లు కూడా చేయలేదు. టీజర్, ట్రైలర్ ఈవెంట్స్ లాంటివి ఏమీ నిర్వహించలేదు. అయినా సరే థియేటర్లలో ఈ సినిమా అద్భుతమైన వసూళ్లను రాబడుతోంది. కేవలం ఆడియన్స్ నుంచి వచ్చిన పాజిటివ్ మౌత్ టాక్ వల్లే ఇది పాజిబుల్ అయినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.












Click it and Unblock the Notifications