Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నీ కటౌట్‌కి అవసరమా .. అనుష్క "అరుంధతి" రీమేక్‌లో శ్రీలీల..!!

చిత్ర పరిశ్రమలో ట్రెండ్ క్రియేట్ చేసిన సినిమాలు కొన్ని ఉంటాయి. అలాంటి కల్ట్ క్లాసిక్స్ ని టచ్ చేయకుండా ఉంటేనే మంచిది. కానీ అలాంటి సాహసం చేసి బరీ డిజాస్టర్లను చవి చూసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇప్పటివరకు తెలుగులో చాలా హిట్ సినిమాలు బాలీవుడ్ లో రీమేక్ అయ్యాయి. కొన్ని హిట్ అయ్యాయి.. ఇంకొన్ని ప్లాప్ అయ్యాయి. అయినా కూడా బాలీవుడ్ మాత్రం తెలుగు సినిమాలను రీమేక్ చేసే దండయాత్రని మాత్రం ఆపడం లేదు. ఇప్పుడు కూడా అదే చేయబోతున్నట్టు టాక్ వినిపిస్తుంది.

లేడీ సూపర్ స్టార్ అనుష్క కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అరుంధతి. కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను మల్లెమాల ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై శ్యామ్ ప్రసాద్ రెడ్డి నిర్మించాడు. 2009 లో రిలీజైన ఈ సినిమా ఒక హిస్టరీని క్రియేట్ చేసింది. అరుంధతిగా అనుష్కను తప్ప ఇంకెవరినీ ఊహించుకోలేనంత విధంగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పుడు ఆ చిత్రాన్ని హిందీలో తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారట. బాలీవుడ్ మీడియాలో ఈ వ్యవహారం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.

arudhathi-movie-bollywood-remake-as-sreeleela-in-lead-role

సినీవర్గాల సమాచారం ప్రకారం బాలీవుడ్ అరుంధతి రీమేక్ చేయడానికి రెడీ అయినట్టు తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవితో గాడ్ ఫాదర్ తెరకెక్కించిన మోహన్ రాజా ఈ సినిమాకు దర్శకత్వం వహించే బాధ్యతలు చేపట్టనున్నట్టు టాక్. కాగా అనుష్క ప్లేస్ లో అందాల భామ శ్రీలీలను తీసుకోవాలని చూస్తున్నారట. అమ్మడు డ్యాన్సర్ కావడంతో.. అనుష్కను మ్యాచ్ చేస్తుందని అనుకుంటున్నారట.

ఇక ఇప్పటికే అరుంధతి సినిమాని పలు భాషల్లో రీమేక్ కూడా చేశారు. అయితే ఆ సినిమాలు హిట్ అయ్యాయో లేదో అన్న విషయం పక్కన పెడితే అసలు వచ్చినట్టు కూడా చాలా మందికి తెలియదు అంటే అతిశయోక్తి కాదు. బాలీవుడ్ లో మాత్రం ఈ సినిమాని ఇన్నాళ్లు రీమేక్ చేసే సాహసం చేయకపోయినా.. మొదట్లో దీపికాతో ఈ సినిమాను రీమేక్ ప్లాన్ చేశారు కానీ అది కార్యరూపం దాల్చలేదు. అయితే ఇన్నాళ్లకు మళ్లీ ఈ సినిమా రీమేక్ మ్యాటర్ తెరమీదకు రావడం హాట్ టాపిక్ గా మారింది.

అయితే ఈ వార్త విన్న నెటిజన్స్ మాత్రం ఒకింత షాక్ అవుతున్నారు. జేజమ్మ పాత్రలో అనుష్క నటన న భూతో న భవిష్యత్తు అన్నట్టు ఉంటుంది. అందులోనూ అనుష్క కటౌట్ కి ఆ క్యారెక్టర్ పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. కానీ శ్రీలీలా విషయానికి వస్తే మాత్రం అనుష్కను అసలు ఎలా మ్యాచ్ చేస్తుందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఆమె కటౌట్ కి ఈమె కటౌట్ కి పోలిక అసలు ఉందా అంటూ జోక్స్ వేస్తున్నారు. అంతే కాకుండా శ్రీలీల డాన్స్ ఇరగదీస్తుంది కానీ యాక్టింగ్ విషయంలో మాత్రం ఆ రేంజ్ ప్రశంసలు ఎప్పుడు దక్కించుకోలేదు. మరి అనుష్క సినిమాని ఆమెతో చేయడం అంటే రిస్క్ అని.. వరుస ఫ్లాప్ లతో ఉన్న ఈ భామ ఖాతాలో మరో ఫ్లాప్ గ్యారంటీ అని పోస్టులు పెడుతున్నారు.

arudhathi-movie-bollywood-remake-as-sreeleela-in-lead-role

మరి ఈ రీమేక్ విషయంలో నిజమెంత.. అబద్ధమెంత అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగక తప్పదు. మరోవైపు శ్రీలీల హిందీలో కార్తీక్ ఆర్యన్ సినిమాతో ఎంట్రీ ఇవ్వబోతుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కానుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+