ఓటీటీలో అదరగొడుతున్న కొత్త సినిమా...!

ఇటీవల కాలంలో ఓటీటీలో చిన్న సినిమాలు సత్తా చాటుతున్నాయి. కంటెంట్ ఉన్న సినిమాలకు ప్రేక్షకుల నుంచి మంచి ఆధారణ లభిస్తోంది. ముఖ్యంగా వెబ్ సిరీస్‌లు , చిన్న సినిమాలు, డబ్బింగ్ సినిమాలకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభిస్తోంది. కంటెంట్ బాగుంటే చాలు తెలుగు ప్రేక్షకులు పరభాష సినిమాను సైతం నెత్తిన పెట్టుకుంటారనే విషయం తెలిసిందే. తాజాగా ఓటీటీలో ఓ సినిమా సత్తా చాటింది.

"ఇరవై మూడు" ఒక సినిమాగా ప్రేక్షకుల మనసులపై చెరగని ముద్ర వేసింది. చిన్న దొంగతనంతో మొదలై, ఊహించని విషాదానికి దారితీసిన ఒక యువకుడి జీవిత ప్రస్థానం ఇది. జూన్27 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.ఒక వర్తమాన దళితుని వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందించబడిన ఈ చిత్రం, మనిషి జీవిత మార్గాన్ని ఎలా మలుచుకుంటుందో అద్భుతంగా చూపిస్తుంది.

arvai mudu movie is impressing the OTT audience

చిలకలూరిపేట అనే పల్లెటూరిలో ప్రారంభమైన ఈ కథ, ప్రేమ, బాధ్యతల మధ్య నలిగిన యువ జంట జీవితాన్ని ఆవిష్కరిస్తుంది. పెళ్లికి ముందే గర్భవతి అయిన ప్రేయసికి మంచి జీవితం ఇవ్వాలనే తపనతో, యువకుడు స్నేహితుడితో కలిసి దొంగతనానికి పాల్పడతాడు. కానీ ఆ దొంగతనమే 23 మంది ప్రాణాలను బలితీసుకుని, అతని జీవితాన్ని సమూలంగా మార్చేస్తుంది.

జైలు జీవితం, అణచివేతలు, దళితునిగా ఎదురైన అనుభవాలు అతడిని ఒక విప్లవకారుడిగా మారుస్తాయి. అతను రచించిన "Sagar - A Book For Crime Free Society" పుస్తకం, సమాజానికి మార్గదర్శనం అవుతుందనే భయంతో ప్రభుత్వమే ప్రచురణకు అనుమతించకపోవడం, ఈ కథలోని నైతిక సంకటాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది. తక్కువ బడ్జెట్‌తో రూపొందించినప్పటికీ, దర్శకుడు కథను భావోద్వేగంతో, నిజాయితీతో చెప్పడంలో గొప్ప విజయం సాధించారు.

నటన, దర్శకత్వం, సాంకేతికాంశాలు అన్నీ సినిమాకు బలం చేకూర్చాయి. నాయకానాయికలు తమ పాత్రలలో జీవించారు. గ్రామీణ వాతావరణాన్ని అద్భుతంగా ప్రతిబింబించిన సినిమాటోగ్రఫీ, హృదయాన్ని తాకే నేపథ్య సంగీతం సినిమాకు ప్రాణం పోశాయి. "ఇరవై మూడు" లాంటి సినిమాలు నిశబ్ద విప్లవాలు. ఇవి మనసుల్లో మార్పుకు నాంది పలుకుతాయి. ఇది మనం నేర్చుకోవాల్సిన ఒక నిజం. అమెజాన్ ప్రైమ్ వీడియోలో తప్పక చూడాల్సిన చిత్రం ఇది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+