జ్యోతిష్యుడితో పూజలు చేయించిన అషురెడ్డి

వివాదాస్పద జ్యోతిష్యుడు వేణుస్వామి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రాజకీయ రంగంలో, సినీ రంగంలో సెలబ్రిటీల వ్యక్తిగత జాతకాలు చెబుతూ చివరకు ఆయన కూడా ఒక సెలబ్రిటీ అయిపోయారు. సినీ రంగంలో సమంత-నాగచైతన్య విడాకులు తీసుకుంటారని ముందే చెప్పారు. ఆయన చెప్పినవాటిల్లో జరిగేందేమైనా ఉందా? అంటే ఇదొక్కటే. మిగతా విషయాలు జరిగాయో లేదో ఆయనకే తెలియాలి.

ఒక విషయం జరగడంతో మిగతా 99 విషయాలను వదిలేసిన జనాలు ఆయనవెంట పడటం మొదలుపెట్టారు. అంతేకాకుండా రష్మిక చేత ప్రత్యేకంగా పూజలు చేయించారు. ఆ పూజలు చేయించిన తర్వాత ఆమె నేషనల్ క్రష్ గా మారింది. తాజాగా యానిమల్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. దీంతో ఇతర హీరోయిన్లు నిధి అగర్వాల్, డింపుల్ హయతి, ఇనయ సుల్తానా లాంటివారు ఆయనచేత ప్రత్యేకంగా పూజలు చేయించుకున్నారు. అయితే వీరెవరూ రష్మికలా జాతీయస్థాయిలో స్టార్ హీరోయిన్ కాలేకపోయారు.

ashureddy performs pooja with astrologer venu swamy

ఆయన చేసే పూజలు కూడా ఖర్చుతో కూడుకున్నవై ఉంటాయి. రూ.లక్షలు ఖర్చుచేయాల్సి ఉంటుందని చెబుతుంటారు. ఒక్కో పూజకు ఒక్కో రేటు ఉంటుంది. పూజలు జరిగే సమయంలో మద్యం సీసాలు కూడా ఆ పూజల్లో ఉంటాయి. మరి అవేం పూజలో ఆయనకు, చేయించుకున్నవారికే తెలియాలి. తాజాగా బిగ్ బాస్ ఫేమ్ అషురెడ్డి కూడా ఆయనతో పూజ చేయించుకుంది. రాజశ్యామలాదేవి, బగళాముఖీ దేవీ పూజలు నిర్వహించారు. దీనికి సంబంధించిన వీడియో విడుదలైంది. సోషల్ మీడియాలో ఈమె యాక్టివ్ గా ఉంటుంది. బిగ్ బాస్ 3 సీజన్ లో పాల్గొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+