విపరీతమైన కాస్ట్ ఫీలింగ్ ఉన్న అశ్వనీదత్.. అల్లుళ్లు మాత్రం బయట కులం వాళ్లే
కల్కి సినిమాతో యావత్తు దేశం మొత్తం కూడా ఊగిపోతుంది. ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన కల్కి సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు. గురువారం ప్రేకక్షుల ముందుకొచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. రూ. 600 కోట్ల భారీ బడ్జెట్‌తో తెకకెక్కిన ఈ సినిమా తొలి రెండు రోజుల్లోనే రూ.300 కోట్లు కలెక్ట్ చేసి బాక్సాఫీస్ వద్ద ప్రభాస్ స్టామినాను మరోసారి నిరూపించింది. పురాణాలకు, కలియుగాంతానికి, కల్కి అవతారానికి లింక్ చేస్తూ డైరెక్టర్ నాగ్ అశ్విన్ అద్భుతమైన ప్రపంచాన్ని సృష్టించారు.
ఈ సినిమా కంటెంట్, విజువల్స్, వీఎఫ్ఎక్స్, డైరెక్టర్ నాగ్ అశ్విన్ విజన్‌కు ఆడియన్స్ ఫిదా అవుతూ అతనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాను తెరకెక్కించడానికి ముఖ్య కారణం ప్రియాంక దత్, స్వప్న దత్. వీరద్దరు కూడా ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ కుమార్తెలు. కల్కి దర్శకుడు నాగ్ అశ్విన్, అశ్వనీదత్ రెండవ కుమార్తె ప్రియాంక భర్త అనే విషయం చాలామంది తెలియదు. వీరి కాంబినేషన్‌లో గతంలో మహానటి సినిమా సైతం ప్రేక్షకుల ముందుకొచ్చింది.

ఇదిలా ఉంటే తాజాగా అశ్వనీదత్‌కు సంబంధించిన ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. అశ్వనీదత్‌కు మొదటి నుంచి కూడా క్యాస్ట్ ఫీలింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఆయన కమ్మ సామాజిక వర్గాన్ని బాగా ఎంకరేజ్ చేస్తారనే టాక్ ఇండస్ట్రీలో నెలకొంది. టీడీపీ కోసం సినిమా ఇండస్ట్రీలో ఎవరు ఇవ్వని ఓపెన్ స్టేట్మెంట్స్ ఇస్తుంటారు. మరి ఇంత కాస్ట్ ఫీలింగ్ ఉన్న అశ్వనీదత్ తన ఇద్దరు అల్లుళ్ళు కూడా బయట వారే కావడం విశేషం.అశ్వనీదత్ ఇద్దరు కుమార్తెలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
అశ్వనీదత్ మొదటి కుమార్తె స్వప్న ప్రసాద్ వర్మ అనే వ్యక్తిని 2010లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ వివాహం మొదట తండ్రికి ఇష్టం లేదు.కానీ శక్తి సినిమా షూటింగ్స్ సమయంలో తన ప్రేమ విషయాన్ని స్వప్న జూనియర్ ఎన్టీఆర్తో చెప్పగా, ఆయన దగ్గరుండి అశ్వనీదత్‌ను ఒప్పించి వీరి పెళ్లి జరిపించారు. ఇక ప్రియాంక సైతం తన తండ్రి ఇష్టానికి వ్యతిరేకంగా వేరే కులం వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకున్నారు. అతడే నాగ్ అశ్విన్ కల్కి సినిమా దర్శకుడు. ఇలా విపరీతమైన కాస్ట్ ఫీలింగ్ ఉన్న అశ్వనీదత్ తన కూతుర్లకు మాత్రం వేరే కులం అబ్బాయిలకు ఇచ్చి వివాహం జరిపించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.












Click it and Unblock the Notifications