ప్రభాస్ ఆరోగ్యంపై మరో బాంబు పేల్చిన వేణు స్వామి..
ప్రముఖ జ్యోతిష్యుడు వేణు మరోసారి వార్తల్లో నిలిచారు. ఆయన తాజాగా ప్రభాస్ ఆరోగ్యం గురించి చెప్పి సంచలనం సృష్టించారు. సినీ, రాజకీయ ప్రముఖుల జాతకాలు చెబుతూ వేణు స్వామి రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఫేమస్ అయ్యారు. అయితే ఆయన గతంలో చెప్పినవి చెప్పినట్టుగా జరగడంతో.. వేణు స్వామిని ఫాలో అయ్యేవారి సంఖ్య పెరిగిపోయింది. సమంత, నాగచైతన్యలు వివాహిక జీవితం అంత సాఫీగా సాగదని .. మెగా డాటర్ నిహారిక కూడా విడాకులు తీసుకుంటుందని ముందే చెప్పి సంచలనం సృష్టించారు.
అయితే ప్రభాస్ విషయంలో వేణు స్వామి మొదటి నుంచి కూడా వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. రెబల్ స్టార్ ప్రభాస్ ఆదిపురుష్ సినిమా ఫ్లాప్ గురించి ముందే చెప్పి సోషల్ మీడియాలో ఫుల్ పాపులారిటీని సంపాదించకున్నారాయన. దీంతో సోషల్ మీడియాలో వేణు స్వామి జ్యోతిష్యానికి ఒక రేంజ్‌లో క్రేజ్ పెరిగింది. సెలబ్రిటీలు సైతం ఆయనతో పూజలు చేయించుకోవడం మొదలుపెట్టారు.

డింపుల్ హాయతి, రష్మిక, నిధి ఆగర్వాల్ వంటి హీరోయిన్లు వేణు స్వామి చేత జాతక దోష నివారణ పూజలు చేయించుకున్నారంటే ఆయన ప్రభావం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. తెలంగాణ ఫలితాల సమయంలో.. సలార్ సినిమా విషయంలో వేణు స్వామి లెక్కలు తప్పాయి. తెలంగాణలో కేసీఆర్ మరోసారి సీఎం అవుతారని చెప్పగా, కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు.

అలాగే ప్రభాస్ నటించిన సలార్ కూడా ఫ్లాప్ అవుతుందని.. ప్రభాస్‌కు ఇప్పట్లో హిట్ దొరకడం కష్టమని వేణు స్వామి చెప్పగా.. బాక్సాఫీస్ వద్ద సలార్ సూపర్ హిట్‌గా నిలిచింది. దీంతో వేణు స్వామిని టార్గెట్ చేసుకుని ప్రభాస్ అభిమానులు విమర్శలు చేస్తున్నారు.ఇదిలా ఉంటే ప్రభాస్‌పై వేణు స్వామి మరో బాంబు పేల్చారు. ప్రభాస్‌కు ఇటీవలే పెద్ద సర్జరీ జరిగిందని..అందుకే ప్రభాస్ సలార్ సినిమా ప్రమోషన్స్‌కు రాలేదని వేణు స్వామి తెలిపారు.

సలార్ షూటింగ్ తరువాత ప్రభాస్ మూడు నెలలు ఇండియాలోనే లేడని.. సర్జరీ కోసం విదేశాలకు వెళ్లాడని వేణు స్వామి చెప్పారు. సలార్ ప్రమోషన్స్‌కి రాకపోవడానికి కూడా అదే కారణమని అని చెప్పారు. దీని కారణంగానే ప్రభాస్ తెలంగాణ ఎన్నికల్లో ఓటు కూడా వేయలేదని ఆయన చెప్పుకొచ్చారు. మీడియాకు సైతం ప్రభాస్‌కు సర్జరీ జరిగిందనే విషయం తెలియకుండా జాగ్రత్తపడ్డారని వేణు స్వామి పేర్కొన్నారు. అయితే ప్రభాస్ ఆరోగ్యం గురించి వేణు స్వామి చేసిన కామెంట్స్‌పై ఆయన అభిమానులు గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రభాస్‌కు సర్జరీ జరిగిందని వేణు స్వామి చెప్పిన దాంట్లో ఎంత వరకూ వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది.
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి












Click it and Unblock the Notifications