షాక్‌కు గురైన జూనియర్ ఎన్టీఆర్- ఉలిక్కిపడ్డ టాలీవుడ్

Saif Ali Khan: బాలీవుడ్ హాట్ స్పాట్ ముంబైలో దిగ్భ్రాంతికర సంఘటన చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో ఓ గుర్తు తెలియని చొరబడ్డాడు. ఆయనపై కత్తితో దాడి చేశాడు. మూడుసార్లు పొడిచాడు. కత్తిపోట్లకు గురయ్యాడు సైఫ్ అలీ. సమాచారం అందిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. గాయపడ్డ సైఫ్‌ను హుటాహుటిన ముంబై లీలావతి ఆసుపత్రికి తరలించారు.

బుధవారం అర్ధరాత్రి దాటిన తరువాత ఈ ఘటన చోటు చేసుకుంది. బాంద్రా వెస్ట్ ప్రాంతంలో గల సద్గురు శరణ్ బిల్డింగ్స్‌లో భార్య కరీనా కపూర్, ఇద్దరు పిల్లలు తైమూర్, జేహ్‌తో కలిసి నివసిస్తోన్నారు సైఫ్ అలీ. హై- సెక్యూరిటీ జోన్‌గా పరిగణిస్తుంటారీ ప్రాంతాన్ని. ఆయన ఇంటికి ప్రైవేట్ భద్రత కూడా ఉంది.

Attack on Saif Ali Khan actor Jr NTR expressed shock and wishing speedy recovery

అర్ధరాత్రి దాటిన తరువాత గుర్తు తెలియని వ్యక్తి ఇంట్లోకి చొరబడ్డాడు. తన వెంట తెచ్చుకున్న కత్తితో బీభత్సం సృష్టించాడు. దోపిడీ కోసం అతను ఇంట్లోకి వచ్చి ఉంటాడని అనుమానిస్తోన్నారు. ఇంటి పనిమనిషులు తొలుత అతన్ని చూశారు. అడ్డుకోవడానికి ప్రయత్నించారు. వారిని కత్తితో బెదిరించాడా ఆగంతకుడు.

ఇంట్లో కేకలు, అరుపులు వినిపించడంతో సైఫ్ అలీ ఖాన్ అప్రమత్తం అయ్యారు. పనివాళ్లతో కలిసి ఆ అజ్ఞాతవ్యక్తిని పట్టుకోవడానికి ప్రయత్నించగా.. ఆయనపై కత్తితో దాడి చేశాడు. మూడుసార్లు కత్తితో పొడిచాడు. దీనితో సైఫ్ అలీ అక్కడే రక్తపుమడుగులో పడిపోయారు. ఆయనను హుటాహుటిన లీలావతి ఆసుపత్రికి తరలించారు.

తెల్లవారు జామున 3 నుంచి 3:30 నిమిషాల మధ్య సైఫ్ అలీ ఖాన్‌ ఆసుపత్రిలో అడ్మిట్ అయినట్లు లీలావతి ఆసుపత్రి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నీరజ్ ఉత్తమణి తెలిపారు. ఆయన శరీరంపై మొత్తం ఆరుచోట్ల గాయాలయ్యాయిన వెల్లడించారు. రెండు చోట్ల లోతుగా కోసుకుపోయినట్లు వివరించారు.

ఈ ఘటన పట్ల తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఉలిక్కిపడింది. దిగ్భ్రాంతికి గురైంది. ఆదిపురుష్, దేవర సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు సైఫ్ భాయ్. విలక్షణమైన నటనతో ఆకట్టుకున్నాడు. ఈ రెండు సినిమాల్లో ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్‌తో పోటీ పడి నటించారు.

సైఫ్‌పై దాడి పట్ల జూనియర్ ఎన్టీఆర్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ ఘటన తనకు షాక్‌కు గురి చేసిందని అన్నారు. దాడి ఉదంతం తనను ఆవేదనకు గురి చేసిందని చెప్పారు. సైఫ్‌ను సర్‌గా సంబోధించారాయన. వేగంగా కోలుకోవాలని, సంపూర్ణ ఆరోగ్యవంతుడు కావాలని కోరుకుంటోన్నట్లు ట్వీట్ చేశారు.

ఈ సమాచారం అందిన వెంటనే అటు బాలీవుడ్‌లో కలకలం మొదలైంది. అజయ్ దేవ్‌గణ్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ సహా పలువురు నటులు, దర్శకులు, టెక్నీషియన్లు ఈ ఘటన పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సైఫ్ అలీ ఖాన్ ఆరోగ్యం పట్ల ఆరా తీస్తోన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+