మనం పెళ్లి చేసుకుంటే తల్లిలా కనిపిస్తా.. ఫ్యాన్‌కి స్టార్ బ్యూటీ రిప్లై !
అవంతిక మోహన్.. మలయాళ సినిమాల్లో, టెలివిజన్ సీరియల్స్‌లో తన ప్రత్యేకమైన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముందుగా టీవీ సీరియల్స్ ద్వారా అభిమానులకు బాగా చేరువయ్యారు. ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి యక్షి - ఫేత్‌ఫుల్లీ యువర్స్, గర, ఆలమరం వంటి పలు సినిమాలతో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. ప్రస్తుతం ఆమె కీలక పాత్రలో నటించిన "ధీరమ్" సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.
కాగా ఈ భామ వ్యక్తిగత జీవితంలో 2017లో అనిల్ కుమార్‌ను పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు రుద్రాన్ష్ అనే కుమారుడు ఉన్నారు. అటు సినిమాలు, పర్సనల్ లైఫ్ తో పాటు సోషల్ మీడియా లోనూ యాక్టివ్ గా ఉంటూ తన గురించి పంచుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు ఈ బ్యూటీకి సోషల్ మీడియాలో షాకింగ్ ప్రపోజల్ రావడం.. అందుకు ఆమె అదిరిపోయే రిప్లై ఇవ్వడం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.

మ్యారేజ్ ప్రపోజల్..
కాగా హీరోయిన్లకు అభిమానుల నుంచి పెళ్లి ప్రపోజల్స్ రావడం కొత్తేమీ కాదని చెప్పాలి. చాలా మంది సెలబ్రిటీలకు ఇలాంటి మెసేజ్‌లు తరచూ వస్తూనే ఉంటాయి. ఎక్కువ మంది నటీమణులు వాటిని పట్టించుకోకుండా వదిలేస్తారు. కానీ తాజాగా హీరోయిన్ అవంతిక మోహన్ తనకు వచ్చిన ఓ ప్రపోజల్ విషయంలో రియాక్ట్ అయ్యారు. ఒక 17 ఏళ్ల చిన్నవాడు ఏడాది రోజులుగా ప్రతిరోజూ ఆమెకు మెసేజ్‌లు పెడుతూ, "నన్ను పెళ్లి చేసుకో" అని పట్టుబడుతున్నాడు అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టింది.
ఆ పోస్టులో.. నువ్వు ఇంకా చాలా చిన్నవాడివి. నీ వయసు 16 లేదా 17 మాత్రమే ఉంటుంది. జీవితమంటే ఏంటో ఇంకా పూర్తిగా తెలియని వయసులో ఉన్నావ్. ఇప్పుడు నువ్వు చదువుకోవడంపై దృష్టి పెట్టాలి. ఏడాదికాలంగా నన్ను పెళ్లి చేసుకోవాలని మెసేజ్‌లు పెడుతున్నావ్.. కానీ మ్యారేజ్ ఆలోచించాల్సిన వయసు ఇది కాదు. నువ్వు బుద్ధిగా చదువుకుంటే భవిష్యత్తులో మంచి స్థాయికి వెళ్తావ్." అని సలహా ఇచ్చారు.

అంతే కాకుండా "నీకంటే నేను చాలా పెద్దదాన్ని. ఒకవేళ మనిద్దరం పెళ్లి చేసుకున్నామనుకో.. అందరూ నన్ను నీ భార్యగా కాకుండా నీ తల్లిగా భావిస్తారు. కాబట్టి నీ చదువుపై దృష్టి పెట్టు. సరైన సమయం వచ్చినప్పుడు నీ జీవితంలోనూ మంచి ప్రేమకథ మొదలవుతుందని రాసుకొచ్చారు. కానీ అవంతిక మోహన్ మాత్రం ప్రత్యేకంగా సోషల్ మీడియాలో రియాక్ట్ కావడంతో అభిమానులు ఆశ్చర్యపోయారు. చాలా మంది ఆమెను ప్రశంసిస్తూ - "ఇలాంటి రిప్లై చాలా పాజిటివ్‌గా ఉంది. చిన్నవాడిని నిరుత్సాహపరచకుండా సలహా ఇచ్చింది" అని కామెంట్లు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications