కాపాడతాడనుకుంటే అతడే కాటేశాడు - యంగ్ హీరోయిన్

ప్రతి ఇండస్ట్రీల్లోనూ మహిళలకు వేధింపులు తప్పడం లేదు. పని చేసే ప్రతిచోట అమ్మాయిలు అభద్రతా భావంతో ఉన్నారని ఇటీవల ఓ సర్వేలో తేలింది. ఇక
సినిమా ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందని చాలామంది బహిరంగంగానే వెల్లడించారు. తమకు ఎదురైన లైంగిక వేధింపులు ,కాస్టింగ్ కౌచ్‌, కమింట్మెంట్‌ల గురించి హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఇటీవల పలు సందర్భాల్లో వెల్లడిస్తున్నారు. తాజాగా ఓ హీరోయిన తన జీవితంలో ఎదురైన లైంగిక వేధింపుల గురించి బయటపెట్టింది.

తెలుగు ఇండస్ట్రీలో అవికా గోర్‌కు మంచి క్రేజ్ ఉంది. 'చిన్నారి పెళ్లి కూతురు'సీరియల్ ద్వారా అవికా గోర్ తెలుగు ప్రేక్షకులకు పరిచియం అయింది. ఈ సీరియల్‌లో తన నటనతో అందర్ని ఆకట్టుకుంది. ఆ తర్వాత నాగార్జున నిర్మించిన 'ఉయ్యాల - జంపాల' సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది అమ్మడు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. తొలి సినిమా హిట్ కావడంతో అవికా గోర్‌కు తెలుగులో వరుస సినిమాల్లో నటించింది. అయితే ఆమె నటించిన సినిమాలేవి కూడా బాక్సాఫీస్ వద్ద సరైన విజయాలు సాధించలేదు. ఇదే సమయంలో అవికా గోర్ రెమ్యూనిరేషన్ సైతం పెంచడంతో ఆమెకు తెలుగులో ఆఫర్లు తగ్గిపోయాయి.

Avika Gor reveals shocking facts about her body guard

ఇక వ్యక్తిగత కారణాలతో కొంతకాలం సినిమాలు దూరం అయింది. అయితే చేసిన తప్పులను తెలుసుకున్న అవికా గోర్.. ఈ మధ్య వరుస సినిమాలకు గ్రీన్ సీగ్నల్ ఇస్తోంది. అవికా గోర్ తాజాగా ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ తన జీవితంలో ఎదురైన లైంగిక వేధింపుల ఘటన గురించి వెల్లడించింది. బయటకు వెళ్లినప్పుడు అభిమానుల నుంచి నన్ను కాపాడుకోవడానికి ఓ వ్యక్తికి నేను బాడీ గార్డుగా ఉద్యోగం ఇచ్చానని ఈ భామ తెలిపింది.

కానీ నాతో అతను అసభ్యంగా ప్రవర్తించాడు. ఓ ఈవెంట్‌లో నన్ను బాడీగార్డు దారుణంగా తాకాడు. అతను రెండు సార్లు అలాగే ప్రవర్తించడంతో నేను ఏంటి అని అడిగాను. వెంటనే నాకు సారీ చెప్పాడని తెలిపింది. కొద్ది రోజులకే అతన్ని తొలగించానని అవికా గోర్ తెలిపింది. నన్ను తాకిన ఆ బాడీగార్డును కొట్టే ధైర్యం నాకు అప్పుడు లేదు. కానీ ఇప్పుడు నాతో అసభ్యంగా ప్రవర్తించిన వారిని కొట్టగలనంటూ ధైర్యంగా మాట్లాడింది. ప్రస్తుతం అవికా గోర్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+