పుకార్లకు చెక్ పెట్టి.. రియాలిటీ షోలోనే పెళ్లి చేసుకోబోతున్న స్టార్ హీరోయిన్!
తెలుగు రాష్ట్రాల ప్రజలకు చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇందులో ఆనందిగా అందరి మనసుల్ని దోచుకుంది అవికా గోర్. అప్పట్లో ఆనంది, జగదీష్ క్యారెక్టర్స్ కు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉండేది. అంతలా ఈ సీరియల్ తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. అయితే ఇందులో ఆనంది పాత్రలో మెరిసిన ప్రముఖ నటి అవికా గోర్ త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు. తన 27వ ఏట తాను ప్రేమించిన వ్యక్తిని ఓ నేషనల్ టీవీ ఛానల్ లో వివాహం చేసుకోబోతున్నారు.
రియాలిటీ షోలో పెళ్లి..
'చిన్నారి పెళ్లికూతురు' సీరియల్‌తో ప్రతి తెలుగింటికి పరిచయం అయిన నటి అవికా గోర్. ఆ తర్వాత 'ఉయ్యాల జంపాల' సినిమాతో వెండితెరకు పరిచయం అయింది. ఈ సినిమా హిట్ కావడంతో ఆమెకు వరుస ఆఫర్స్ వచ్చాయి. సినిమా చూపిస్తా మావా, వధువు, ఎక్కడికి పోతావు చిన్నవాడా లాంటి చిత్రాలతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైంది.

ఈ అందాల నటి అవికా గోర్ తన కాబోయే భర్త మిలింద్ చంద్వానితో కలిసి "పతీ, పత్నీ ఔర్ పంగా " అనే రియాలిటీ షోలో పాల్గొంటున్నారు. ఇప్పుడు ఈ షోలోనీ వీరిద్దరూ ఏడడుగులు వేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. వారి పెళ్లికి సంబంధించిన సన్నాహాలు కూడా ప్రారంభమయ్యాయి. ఈ వార్తలను షో టీమ్ కూడా ధ్రువీకరించింది. అంతే కాకుండా.. ఆధ్యాత్మిక గురువు రాధే మా, ప్రముఖ సింగర్ నేహా కక్కర్ వంటి వారు ఈ వివాహ వేడుకకు హాజరవుతారని కూడా వెల్లడించింది. అవికా గోర్ గత జులైలోనే పెళ్లి గురించి ప్రకటించి, ఈ షోలో పాల్గొనడానికి ముందు నిశ్చితార్థం చేసుకున్నారని సమాచారం.
అవికా గోర్ ఎవరిని పెళ్లి చేసుకోబోతున్నారు?
అవికా గోర్, మిలింద్ చంద్వానిల మధ్య ఆరేళ్ల వయస్సు తేడా ఉంది. 1997 జూన్ 30న జన్మించిన అవికాకు ఇప్పుడు 27 ఏళ్లు. ఆమెకు కాబోయే భర్త మిలింద్ చంద్వాని 1991 మార్చి 27న జన్మించారు. ప్రస్తుతం ఆయన వయసు 33 ఏళ్లు. మిలింద్ 2019లో ఎంటీవీ 'రోడీస్' షోలో పాల్గొని నేహా ధూపియా గ్యాంగ్‌లో చేరారు. ఆయన ఐఐఎం అహ్మదాబాద్ నుంచి ఎంబీఏ పట్టా పుచ్చుకున్నారు. అలాగే గతంలో ఇన్ఫోసిస్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా కూడా పనిచేశారు. 'క్యాంప్ డైరీస్' అనే ఎన్జీఓను కూడా స్థాపించారు.
ఒకప్పుడు పుకార్లు.. ఇప్పుడు నిజమైన ప్రేమ
నటి అవికా గోర్ నికర విలువ రూ. 30 కోట్లుగా అంచనా. ఒకప్పుడు ఆమె పేరును 'ససురాల్ సిమర్ కా' సహ నటుడు మనీష్ రాయ్ సింఘానియాతో ముడిపెట్టారు. వీరిద్దరికీ రహస్యంగా ఒక బిడ్డ కూడా ఉన్నట్లు పుకార్లు వచ్చాయి. కానీ, మనీష్, అవికాల మధ్య వయసులో 18 ఏళ్ల తేడా ఉంది. 'మనీష్ మా నాన్న వయసులో ఉన్న వ్యక్తి. అయినా ప్రజలు ఇలాంటి నిరాధారమైన వ్యాఖ్యలు చేస్తున్నారు' అని అవికా గోర్ ఆ పుకార్లను ఖండించారు.
-
దావూద్ ఇబ్రహీం లేకపోతే నేను లేను.. -
"ఆశా బోస్లే"కు భర్త బర్మన్ పెళ్లికి ముందే ఇచ్చిన స్పెషల్ గిఫ్ట్ ఏంటో తెలుసా ??? -
లెజెండరీ గాయని "ఆశాభోస్లే" ఎవరి పాటలు వింటారో తెలుసా..? -
ఆశాభోస్లే - లతా మంగేష్కర్.. అక్క చెల్లెల మధ్య అసలు గొడవేంటి ??? -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
స్టార్ హీరోయిన్ అయ్యే కటౌట్.. కానీ ఒక్క మాట వల్లే సినిమాలకు గుడ్ బై -
తప్పు తప్పు.. అంతకు ముందు అలా చేయలేదా ?? అనసూయ పోస్ట్ వైరల్ !! -
నమ్మినోడే.. ముంచేశాడుగా.. టాలీవుడ్ బడా నిర్మాతకు వెన్నుపోటు !! -
యాంకర్ విష్ణుప్రియకి బిగ్ షాక్.. క్రిమినల్ కేసు?? -
ఆశా భోస్లే చివరి వీడియో వైరల్.. కదిలిస్తున్న దృశ్యాలు! -
ఆశా భోంస్లే 'స్వర' సామ్రాజ్యం.. ఆస్తుల గురించి షాకింగ్ నిజాలు! -
శోకసంద్రంలో చిత్రసీమ, లెజెండరీ సింగర్ కన్నుమూత!












Click it and Unblock the Notifications