పెళ్లైన పది రోజులకే గుడ్ న్యూస్ చెప్పిన తెలుగు హీరోయిన్.. హనీమూన్‌కు వెళ్లకుండానేనా..!
'చిన్నారి పెళ్లి కూతురు'గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమై, ఆ తర్వాత వరుస చిత్రాలతో అలరిస్తున్న నటి అవికా గోర్ ఇటీవల తన పర్సనల్ లైఫ్‌లో ఊహించని సంచలనం సృష్టించింది. తన ప్రియుడు మిలింద్ చద్వానీతో ఐదారేళ్ల ప్రేమ బంధాన్ని పెళ్లి బంధంగా మార్చుకుంది. సెప్టెంబర్ 30న ఒక రియాలిటీ షో వేదికగా ఈ జంట ఒక్కటై, తమ బ్యాచ్‌లర్ లైఫ్‌కు గుడ్ బై చెప్పింది.
పెళ్లి చేసుకున్న వెంటనే, సాధారణంగా హీరోయిన్లు ఇండస్ట్రీకి దూరం అవుతారని లేదా కొంత కాలం బ్రేక్ తీసుకుంటారని అంతా భావించారు. పెళ్లి, హనీమూన్ అంటూ అవికా కూడా కొంత కాలం విరామం తీసుకుంటుందని నెటిజన్లు ఊహించారు. కానీ, అందరి అంచనాలను తలకిందులు చేస్తూ, అవికా గోర్ పెళ్లయిన నెల తిరక్కముందే తన కొత్త సినిమా షూటింగ్‌ను ప్రారంభించింది.

తాజాగా, అవికా గోర్ తన కొత్త సినిమాను ప్రకటిస్తూనే, షూటింగ్ మొదలైన ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకుంది. 'రాజు భజేవాలా' అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అవికా, చందన్ రాయ్ జంటగా నటిస్తున్నారు.
బ్యాండ్ మ్యూజిషియన్ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ మధ్యప్రదేశ్‌లో మొదలైంది. ఈ సినిమా ఓటీటీ వేదికగా విడుదల కానుంది. ఈ చిత్రంలో అవికా గోర్ ఓ పెళ్ళైన మహిళ పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం చెబుతూ.. న్యూ బిగినింగ్స్ అంటూ ఆనందాన్ని వ్యక్తం చేసింది. ఇదంతా చూసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
Within a month of her marriage to Milind Chandwani, 'Chinnari Pellikuthuru' fame Avika Gor surprised everyone by starting the shoot for her new OTT film 'Raaju Bhajewala'. Know about her role as a married woman, the film's genre, and the netizens' reaction to her quick return to work.అమ్మడు హనీమూన్‌కు వెళ్లి భర్తతో ఎంజాయ్ చేస్తుందనుకుంటే, మళ్లీ ఇంత తొందరగా షూటింగ్ మొదలుపెట్టిందేంటి? అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు ఆమె డెడికేషన్‌ను మెచ్చుకుంటూ కంగ్రాట్స్ చెబుతున్నారు. పెళ్లి తర్వాత కూడా కెరీర్‌ను ఆపకుండా అవికా గోర్ తీసుకున్న ఈ నిర్ణయం నిజంగా అభినందనీయం. కొత్త జీవితాన్ని, కొత్త సినిమాను ఒకేసారి బ్యాలెన్స్ చేస్తున్న అవికాకు ఈ చిత్రం మంచి విజయాన్ని అందిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.












Click it and Unblock the Notifications