సార్ 'బాహుబలి' కన్నా 'మగధీర' బాగుంది..చిరంజీవి రిప్లై..ఇప్పటికీ వైరలే..!

భారతీయ చలనచిత్ర చరిత్రను 'పాన్-ఇండియా' అనే కొత్త అధ్యాయంతో లిఖించిన ఘనత 'బాహుబలి' (Baahubali: The Beginning) సినిమాది. అగ్ర దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి, కథానాయకుడు ప్రభాస్ కలయికలో రూపొందిన ఈ దృశ్య కావ్యం, తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లింది. అయితే, ఇంతటి సంచలనం సృష్టించిన ఈ సినిమాకు, తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు 'ఫ్లాప్ టాక్' వచ్చిందంటే నమ్మశక్యం కాదు.

అపారమైన అంచనాల మధ్య, 2015 జూలై 10న విడుదలైన 'బాహుబలి: ది బిగినింగ్' సినిమాకు, తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన తొలి స్పందన మిశ్రమంగా, కొంతవరకు నిరాశ కలిగించే విధంగా ఉంది.

Baahubali 1 First Day Shock Prabhas Heart Attack amp amp Chiranjeevi s Viral Review Comparing it to Magadheera

రూ. 250 కోట్లకు పైగా భారీ వ్యయంతో, ఒక ప్రాంతీయ భాషా చిత్రంగా రూపుదిద్దుకోవడం అప్పటికి ఊహకు అందని విషయం. ఈ సినిమా కోసం చిత్ర బృందం మూడేళ్లు శ్రమించింది. ట్రైలర్స్ మరియు మేకింగ్ విజువల్స్ అంచనాలను ఆకాశాన్ని తాకించాయి.

అయితే, తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లోని ప్రేక్షకులు , విమర్శకుల నుంచి వచ్చిన రివ్యూలు కొంతమందికి షాక్ ఇచ్చాయి.సినిమా మొదటి భాగం (ది బిగినింగ్) కేవలం పాత్రల పరిచయానికే, కథ నేపథ్యాన్ని వివరించడానికే ఎక్కువ సమయం తీసుకుందనే విమర్శ బలంగా వచ్చింది. రాజమౌళి సినిమాల్లో ఉండే భావోద్వేగాల తీవ్రత, హీరో ఎలివేషన్లు తొలి సగంలో తగ్గడం కొంత నిరుత్సాహాన్ని కలిగించింది.

రాజమౌళి మార్క్ అయిన బలమైన భావోద్వేగపు పునాది కంటే, విజువల్ హంగులపై ఎక్కువ దృష్టి పెట్టారనే భావన తెలుగు ప్రేక్షకుల్లో కలిగింది.ప్రభాస్-తమన్నా లవ్ ట్రాక్ సోసోగా అనిపించడం, కథకు అడ్డు తగులుతున్నట్లు అనిపించడం కూడా నెగిటివ్ టాక్‌కి ఒక కారణం. ప్రభాస్ స్వయంగా పంచుకున్న అనుభవం: తన స్నేహితులకు బ్లాక్‌బస్టర్ అయితేనే కాల్ చేయమని చెప్పిన ప్రభాస్‌కి, తొలిరోజు ఉదయం ఎవరూ కాల్ చేయకపోవడంతో గుండెపోటు వచ్చినంత పనైంది, సినిమా ఫ్లాప్ అయ్యిందేమో అని ఫిక్స్ అయిపోయాడట.

అలాగే ఈ సినిమాకు మెగాస్టార్ చిరంజీవి ఇచ్చిన రివ్యూ కూడా అప్పట్లో పెద్ద వైరల్‌గా మారింది. ఎటువంటి అంచనాలు లేకుండా వెళ్లిన వారు మాత్రం సినిమా బాగుందని అంటున్నారని చెప్పడం, దీంతో అక్కడే ఉన్న ఒకరు బాహుబలి కంటే రామ్ చరణ్ నటించిన మగధీర సినిమానే బాగుందని చెప్పడంతో చిరంజీవి కాసేపు మోనం వహించారు. ఇలాంటి సినిమాలు ఆడాలంటూ , బాగా ఆడాలంటూ చిరంజీవి చెప్పిన మాటలు ఇప్పటికి వైరల్ అవుతూనే ఉన్నాయి. తాజాగా బాహుబలి ఎపిక్ రి రీలిజ్ చేయడంతో మెగాస్టార్ చిరంజీవి వీడియో మరోసారి వైరల్ అవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+