'బాహుబలి ది ఎపిక్' టీజర్ రిలీజ్.. ఇంత కొత్తగా ఉందేంటి భయ్యా..!

కొన్ని సినిమాలు వర్ణించాలంటే పదాలు సరిపోవు. అలాంటి మూవీస్ లో బాహుబలి ముందుంటుంది. బాహుబలి సినిమా రిలీజై 10 ఏళ్లు దాటినా ఇప్పటికీ ఆ పాత్రలు, మ్యూజిక్, దర్శక ధీరుడు రాజమౌళి విజన్ కళ్ల ముందే ఉంటుంది. అటు బాక్సాఫీస్ రికార్డులతోపాటు.. ఇటు ప్రేక్షకుడి అనుభూతి పరంగా ఇలాంటి మూవీ న భూతో న భవిష్యత్ అన్నట్లుగా ఉంటుంది. ఈ మూవీ తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి పరిచయం చేసింది. ఈ మూవీ రిలీజైన అన్ని ప్రాంతాల్లో ఆల్ టైమ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

అయితే ఈ హిస్టారికల్ మూవీ రీ రిలీజ్ కానున్నట్లు ఇదివరకే దర్శక ధీరుడు ఎస్. ఎస్. రాజమౌళి ప్రకటించారు. ఈ మూవీ అక్టోబరు 31 న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కు సిద్ధమైంది. అయితే బాహుబలి మూవీ రెండు పార్టులను ఒకే పార్టుగా విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ఇటీవల పేర్కొంది. తాజాగా బాహుబలి ది ఎపిక్ మూవీకి సంబంధించిన టీజర్ విడుదలైంది. 1 నిమిషం 17 సెకన్ల నిడివి ఉన్న ఈ టీజర్ ను ఆసక్తికరంగా కట్ చేశారు. ఇది వరకు చూసిన సీన్లే అయినా కొత్తగా అనుభూతిని కలిగించడం విశేషం. దీంతో రీ- రిలీజ్ లోనూ బాహుబలి మూవీ సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ ఏడాది అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా మూవీ రిలీజ్ కానుంది.

ఇక బాహుబలి మూవీ రన్ టైమ్ టైమ్ గురించి సామాజిక మాధ్యమాల్లో పెద్ద చర్చ నడుస్తోంది. 4 గంటలు అని కొంత మంది లేదు.. 5 గంటలు అని మరికొంత మంది కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు బుక్ మై షో ప్ర‌కారం ఈ సినిమా ర‌న్ టైమ్ 5 గంట‌ల 27 నిమిషాలుగా ఉంది. మరి పూర్తి నిడివి తెలుసుకోవాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే. ఇక బాహుబలి చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కింది.

Baahubali The Epic Teaser Unleashed A Grand Return to Mahishmati

తొలి భాగం 2015 జులై 10న విడుదలైంది. భారతీయ సినీ చరిత్రలో అనేక రికార్డులు సాధించింది. ఆ తర్వాత పార్ట్-2 2017లో రిలీజైంది. తెలుగు సినిమా ఖ్యాతిని మరోస్థాయికి తీసుకెళ్లింది. ఈ మూవీలో బాహుబలిగా ప్రభాస్‌, భళ్లాలదేవగా రానా, దేవసేనగా అనుష్క, శివగామిగా రమ్యకృష్ణ, అవంతికగా తమన్నా, కట్టప్పగా సత్యరాజ్‌ పాత్రల్లో ఒదిగిపోయారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+